‘పెళ్లి చూపులు’ సినిమాలో హీరోయిన్ తండ్రిగా నటించిన దర్శకుడు అనీష్ కురువిల్లా.
‘పెళ్లి చూపులు’ సినిమాలో హీరోయిన్ తండ్రిగా నటించిన దర్శకుడు అనీష్ కురువిల్లా, ‘అమృతం’ సీరియల్ ఫేమ్ శివన్నారాయణ నరిపెద్ది కీలక పాత్రధారులుగా వశిష్ట పారుపల్లిని దర్శకుడిగా పరిచయం చేస్తూ, లోకి ఫిలిమ్స్, బీయంజే స్టూడియోస్ సంస్థలు ఓ సినిమా నిర్మిస్తున్నాయి.
అశ్విన్ హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఇటీవల హైదరాబాద్‌లో ముగిసింది. త్వరలో అమెరికాలోని న్యూయార్క్, మియామీ సిటీల్లో సెకండ్ షెడ్యూల్ షూటింగ్ చేయనున్నారు. ఈ చిత్రానికి సాహిత్యం: సర్వ సి. హెచ్, సంగీతం: వంశీ–హరి, నిర్మాత: సుదేష్, కథ, కథనం, మాటలు, దర్శకత్వం: వశిష్ట పారుపల్లి.