టెస్టుల్లో నంబర్‌వన్ ఆల్‌రౌండర్ ర్యాంక్‌కు అసలైన అర్హత తనకే ఉందని భారత క్రికెటర్ అశ్విన్ నిరూపించాడు. బ్యాటింగ్ చేయడానికి కష్టంగా ఉన్న పిచ్‌పై అద్భుత ఇన్నింగ్‌స ఆడి అర్ధసెంచరీ చేయడంతో పాటు... తనకు అనుకూలంగా ఉన్న పిచ్‌పై ప్రతి బంతికీ ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించాడు. ఫలితంగా ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో రెండో రోజుకే భారత్ పూర్తిగా పట్టు సాధించింది.