మెక్గ్రాత్ జట్టుకు సారథిగా కోహ్లి | Glenn McGrath picks Virat Kohli to lead his Test Team of the Year | Sakshi
Sakshi News home page

మెక్గ్రాత్ జట్టుకు సారథిగా కోహ్లి

Published Fri, Dec 30 2016 1:51 PM | Last Updated on Mon, Sep 4 2017 11:58 PM

మెక్గ్రాత్ జట్టుకు సారథిగా కోహ్లి

మెక్గ్రాత్ జట్టుకు సారథిగా కోహ్లి

సిడ్నీ:అసాధారణ బ్యాటింగ్ తో ఇప్పటికే క్రికెట్లో పలు రికార్డులను సొంతం చేసుకున్న భారత స్టార్ క్రికెట్ విరాట్ కోహ్లి పేరు..ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఇటీవల ప్రపంచ అత్యుత్తమ ఆటగాళ్లతో కూడిన క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) వన్డే జట్టుకు కెప్టెన్ ఎంపికైన కోహ్లి.. అదే దేశానికి చెందిన దిగ్గజ బౌలర్ గ్లెన్ మెక్ గ్రాత్ టెస్టు జట్టులో కూడా సారథిగా ఎంపికయ్యాడు.

 

ఈ ఏడాదికి గాను మెక్గ్రాత్ ఎంపిక చేసిన  తన టెస్టు జట్టులో కోహ్లికి నాయకత్వ బాధ్యతలను అప్పజెప్పాడు.  దాంతోపాటు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకున్న భారత్ ఆల్ రౌండర్ రవి చంద్రన్ అశ్విన్ కూడా మెక్ గ్రాత్ జట్టులో స్థానం దక్కించుకున్నాడు.

12 మందితో కూడిన మెక్ గ్రాత్ టెస్టు జట్టులో ఇంగ్లండ్ ఆటగాళ్లు జో రూట్, బెన్ స్టోక్స్, స్టువర్ట్ బ్రాడ్, జానీ బెయిర్ స్టోలు ఉండగా, న్యూజిలాండ్ జట్టు నుంచి కేన్ విలియమ్సన్ చోటు దక్కించుకున్నాడు. ఇక పాకిస్తాన్ నుంచి స్పిన్నర్ యాసిర్ షా, దక్షిణాఫ్రికా నుంచి పేసర్ రబడాలకు చోటు దక్కించుకున్నారు. మరొకవైపు ముగ్గురు ఆసీస్ ఆటగాళ్లను మాత్రమే తన జట్టులో మెక్ గ్రాత్  ఎంపిక చేశాడు. డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్లను ఆసీస్ జట్టు నుంచి మెక్ గ్రాత్ తీసుకున్నాడు. కేవలం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెటర్ల గౌరవంలో భాగంగానే దిగ్గజ ఆటగాళ్లు తమ జట్టులను ఎంపిక చేసే సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement