
అలాంటి పిచ్‌పై బౌలింగ్ చేస్తేనే మజా
ఏ బౌలర్‌కై నా కఠినమైన పిచ్‌లపై బౌలింగ్ చేస్తేనే అసలు మజా ఉంటుందని సీనియర్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ...
ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్
న్యూఢిల్లీ: ఏ బౌలర్‌కై నా కఠినమైన పిచ్‌లపై బౌలింగ్ చేస్తేనే అసలు మజా ఉంటుందని సీనియర్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి రోజు ఆటలో భారత బౌలింగ్ తీరుపై తను స్పందించాడు. స్పిన్నర్ అశ్విన్ 46 ఓవర్లు వేసి 167 పరుగులు ఇచ్చిన విషయం తెలిసిందే. ‘ట్రాక్ మనకు సవాల్ విసురుతున్నప్పుడు బౌలింగ్ చేయడంలోనే మజా ఉంటుంది. ఈ పరిస్థితిలో లైన్ అండ్ లెంగ్‌తకు కట్టుబడి విభిన్నంగా బంతులు వేసేందుకు ప్రయత్నించాలి. ఇక్కడ వికెట్లు తీసేందుకు పడే కష్టంతోనే ఓ బౌలర్‌లోని నైపుణ్యం అంతా బయటపడుతుంది.
రూట్, స్టోక్స్, మొరుున్ అలీ అద్భుత ఆటగాళ్లు. ఇప్పటిదాకా యువ జట్టుతో కూడిన ఇంగ్లండ్ మెరుగ్గానే ఆడింది. అరుునా టెస్టు ఇంకా ప్రారంభంలోనే ఉంది. అప్పుడే భారత బౌలర్లను తీసివేయలేం. రెండో ఇన్నింగ్‌సలో అశ్విన్, జడేజా రాణిస్తారనే అనుకుంటున్నాను. నాకై తే మన జట్టు 3-0తో సిరీస్ గెలుస్తుందనే అనిపిస్తోంది’ అని హర్భజన్ అన్నాడు. అలాగే భారత టెస్టు జట్టు తరఫున తాము సృష్టించిన రికార్డులను అశ్విన్, జడేజా అధిగమిస్తే సంతోషమేనని చెప్పాడు.