ఈ ఏడాది మరో సరికొత్త టీ20 లీగ్ పురుడు పోసుకోనుంది. ఇంగ్లండ్ వేదికగా వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ పేరిట టోర్నీ మొదలుకానుంది. బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ సినీ, సంగీత సంస్థ ఇంగ్లండ్ క్రికెట్‌బోర్డు సాయంతో ఈ టోర్నమెంట్‌కు శ్రీకారం చుట్టింది.
రిటైర్డ్ ప్లేయర్లు, నాన్- కాంట్రాక్ట్ ఆటగాళ్లు ఈ లీగ్‌లో భాగం కానున్నారు. టీమిండియా చాంపియన్స్ సహా ఆరు జట్లు ఇందులో పాల్గొననున్నాయి. జూలై 3 నుంచి 13 వరకు యూకేలో ఈ టీ20 టోర్నీ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.
కెప్టెన్‌గా యువరాజ్ సింగ్
ఈ క్రమంలో టీమిండియా చాంపియన్స్ తమ జట్టును ప్రకటించింది. సిక్సర్ల కింగ్, 2007(టీ20), 2011(వన్డే) వరల్డ్‌కప్స్ విజేత యువరాజ్ సింగ్ ఈ టీమ్‌కు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. సురేశ్ రైనా, పఠాన్ బ్రదర్స్, ఆర్పీ సింగ్ తదితరులు ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు.
కాగా టీమిండియాతో పాటు వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ లీగ్‌లో ఆస్ట్రేలియా చాంపియన్స్, ఇంగ్లండ్ చాంపియన్స్, సౌతాఫ్రికా చాంపియన్స్, పాకిస్తాన్ చాంపియన్స్, వెస్టిండీస్ చాంపియన్స్ ఆడనున్నాయి.
టీమిండియా చాంపియన్స్ జట్టు:
యువరాజ్ సింగ్ (కెప్టెన్), సురేశ్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, గురుక్రీత్ మాన్, హర్భజన్ సింగ్, రాహుల్ శర్మ, నమన్ ఓజా, రాహుల్ శుక్లా, ఆర్పీ సింగ్, వినయ్ కుమార్, ధవల్ కులకర్ణి.
టీమిండియా చాంపియన్స్ షెడ్యూల్
జూలై 2న ఇంగ్లండ్, జూలై 5న వెస్టిండీస్, జూలై 6న పాకిస్తాన్, జూలై 8న ఆస్ట్రేలియా, జూలై 10న సౌతాఫ్రికా చాంపియన్స్‌తో టీమిండియా చాంపియన్స్ తలపడనుంది. జూలై 12న సెమీస్ జరుగనుండగా.. జూలై 13న ఫైనల్‌కు ముహూర్తం ఖరారైంది.
చదవండి: WC: పక్కా టీ20 టైప్.. న్యూయార్క్ పిచ్ వెనుక ఇంత కథ ఉందా? ద్రవిడ్‌తో కలిసి
Comments
Please login to add a commentAdd a comment