
కౌంటీ క్రికెట్‌లో అశ్విన్ శుభారంభం
తొలిసారి కౌంటీ క్రికెట్ బరిలోకి దిగిన భారత టాప్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మొదటి మ్యాచ్‌లో రాణించాడు.
తొలిసారి కౌంటీ క్రికెట్ బరిలోకి దిగిన భారత టాప్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మొదటి మ్యాచ్‌లో రాణించాడు. వార్సెష్టర్‌షైర్ తరఫున ఆడుతున్న అశ్విన్... గ్లూసెస్టర్‌షైర్‌తో జరుగుతున్న మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 94 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్‌లో తమ జట్టు తరఫున మొత్తం నాలుగు మ్యాచ్‌లు కూడా ఆడాలని భావిస్తున్నట్లు అశ్విన్ చెప్పాడు. అతని నిర్ణయానికి బీసీసీఐ ఆమోదం తెలిపితే అశ్విన్, ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు దూరమవుతాడు.