
చెన్నై: బీసీసీఐ అండర్–23 సౌత్‌జోన్ వన్డే లీగ్‌లో ఆంధ్ర జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. కర్ణాటకతో సోమవారం మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలి మ్యాచ్ సెంచరీ హీరో అశ్విన్ హెబర్ (121 బంతుల్లో 137 నాటౌట్; 13 ఫోర్లు, 4 సిక్సర్లు) ఈ మ్యాచ్‌లోనూ మరో భారీ శతకంతో జట్టుకు ఘనవిజయాన్ని అందించాడు. తొలుత కర్ణాటక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 324 పరుగులు చేసింది.
దేవ్ పడిక్కల్ (112; 11 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీతో పాటు... నిష్కల్ (67; 6 ఫోర్లు), భరత్ (65; 4 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేయడంతో జట్టు భారీ స్కోరు సాధించింది. ఆంధ్ర బౌలర్లలో హరిశంకర్ రెడ్డి, కేవీ శశికాంత్ చెరో 3 వికెట్లు తీశారు. అనంతరం అశ్విన్ జోరుతో ఆంధ్ర 44.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 325 పరుగులు చేసింది. రికీ భుయ్ (52; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), చైతన్య (32 బంతుల్లో 61; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment