సాక్షి, స్పోర్ట్స్: ఇటీవల ఏదో జోక్ చేయబోయి టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చేతికి చిక్కి, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ హర్షల్ గిబ్స్ నోరు కరుచుకున్న విషయం తెలిసిందే. కానీ వారం కూడా గడవకముందే వీరి మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడం, పరిస్థితుల్లో ఎంతో మార్పు రావడంతో క్రికెట్ అభిమానులు ఇది నమ్మలేకపోతున్నారు. నేడు గిబ్స్ జన్మదినం సందర్భంగా భారత బౌలర్ అశ్విన్ సఫారీ మాజీ ఆటగాడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. 'మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలి గిబ్స్. ఈ ఏడాది నీకు కలిసిరావాలంటూ' అశ్విన్ ట్వీట్ చేశాడు. అందుకు ధన్యవాదాలు తెలుపుతూ గిబ్స్ ట్వీట్ ద్వారా బదులిచ్చాడు. మ్యాచ్ ఫిక్సర్‌ను సైతం తమ క్రికెటర్ క్షమించి శుభాకాంక్షలు తెలిపాడని టీమిండియా క్రికెట్ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. గిబ్స్ ఫిక్సర్ అని తెలియక కొందరు అశ్విన్‌కు వ్యతిరేకంగా ట్వీట్లు చేస్తున్నారు.
అశ్విన్ వర్సెస్ గిబ్స్..
తన కొత్త షూ ప్రత్యేకతలు, పరుగెత్తడంలో ఉండే సౌకర్యం గురించి చెబుతూ అశ్విన్ ఒక షూ వీడియో ట్వీట్ చేశాడు. వికెట్ల మధ్య, అవుట్ ఫీల్డ్‌లో అశ్విన్ చురుగ్గా పరుగెత్తలేడనే అంశాన్ని గుర్తు చేసే విధంగా ‘ఇకనైనా నువ్వు మరింత వేగంగా పరుగెత్తగలవని ఆశిస్తున్నా’ అంటూ ఒకింత వ్యంగ్యంతో గిబ్స్ వ్యాఖ్య వదిలాడు. అయితే దీనిపై వెంటనే స్పందించిన అశ్విన్.. నాకు తిండి పెట్టే మ్యాచ్‌లను ఫిక్స్ చేయకూడదనే నైతిక విలువలు పాటించడంలో మాత్రం చాలా అదృష్టవంతుడిని’ అని ఘాటుగా జవాబిచ్చాడు. దాంతో షాక్‌కు గురైన గిబ్స్... జోక్ చేశానని, దీన్ని ఇంతటితో వదిలేయమన్నాడు. తాను కూడా జోక్ చేశానని, నీతో కలసి డిన్నర్ చేస్తానని ట్వీట్ చేశాడు.
గిబ్స్ ఓ ఫిక్సర్
2000 ఏడాది భారత పర్యటనలో భాగంగా మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో గిబ్స్ దోషిగా తేలి దాదాపు ఏడాదిపాటు నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. తనకు 15000 డాలర్ల ఆఫర్ వచ్చిందని గిబ్స్ తన తప్పు ఒప్పుకున్న విషయం తెలిసిందే.
Thanks bud 🤙 have a good day
— Herschelle Gibbs (@hershybru) 23 February 2018
Comments
Please login to add a commentAdd a comment