
నాయకత్వం ఏమిటో ధోని నుంచే నేర్చుకోవాలి: అశ్విన్
కోహ్లికి కెప్టెన్సీ బాధ్యతలు అందించేందుకు ఇదే సరైన సమయమని ధోని భావించి ఉంటాడని భారత బౌలర్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు.
కోహ్లికి కెప్టెన్సీ బాధ్యతలు అందించేందుకు ఇదే సరైన సమయమని ధోని భావించి ఉంటాడని భారత బౌలర్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. ధోని కెరీర్ అద్భుతంగా సాగిందని, గొప్ప గొప్ప కెప్టెన్లు కూడా అతని నుంచి నాయకత్వ పాఠాలు నేర్చుకోవచ్చని అతను అన్నాడు. ధోని సాధించిన ఘనతలను మరొకరు అందుకోవడం చాలా కష్టమని అశ్విన్ చెప్పాడు.
ధోని బాటలో కోహ్లి కూడా విజయవంతమవుతాడని విశ్వాసం వ్యక్తం చేసిన ఈ ఆఫ్ స్పిన్నర్... కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం ధోని వ్యక్తిగత నిర్ణయమని, దానిపై తాను వ్యాఖ్యానించనని అన్నాడు.