Indian star pacer Umesh Yadav announces birth of his daughter - Sakshi
Sakshi News home page

తండ్రైన టీమిండియా స్టార్ క్రికెటర్.. మహిళా దినోత్సవం రోజే గుడ్‌ న్యూస్‌

Published Wed, Mar 8 2023 12:30 PM | Last Updated on Wed, Mar 8 2023 2:49 PM

Indian star pacer Umesh Yadav announces birth of his daughter - Sakshi

టీమిండియా వెటరన్‌ పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌  రెండోసారి తండ్రయ్యాడు. అతడి భార్య తాన్య వధ్వా బుధవారం(మార్చి8) పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఉమేశ్‌ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు. 2013 మే 29న పంజాబ్‌కు చెందిన తాన్యా‌ను ఉమేశ్‌ యాదవ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

2021 జనవరి 1న ఆడ బిడ్డకు జన్మనిచ్చిన ఈ జంట.. ఇప్పుడు రెండో సంతనంగా కూడా పాపకే జన్మనిచ్చింది. ఇక  మహిళా దినోత్సవం రోజున మహాలక్ష్మి తన ఇంటిలో అడుగుపెట్టడంతో పట్టరాని సంతోషంలో ఉమేశ్‌ మునిగి తెలిపోతున్నాడు. ఇక ఉమేశ్ యాదవ్‌కు అభిమానులు, సహచర  ఆటగాళ్లు, మాజీ క్రికెటర్లు అభినందనలు  తెలుపుతున్నారు.

కాగా ఉమేష్‌ యాదవ్‌ ప్రస్తుతం ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ‌లో బీజీబీజీగా ఉన్నాడు. మార్చి 9 నుంచి అహ్మదాబాద్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరగనున్న ఆఖరిటెస్టులో అదరగొట్టేందుకు ఉమేశ్‌ సిద్దమవుతున్నాడు. ఈ క్రమంలో అహ్మదాబాద్‌లో ఉన్న అతడు తన కూతురుని చూడటానికి వెళ్లే వీలు పడలేదు.

ఆఖరి టెస్టు ముగిసిన అనంతరం తన గారాల పట్టిని చూడటానికి ఉమేశ్‌ వెళ్లనున్నాడు. ఇక  మూడో టెస్టులో భారత్‌ ఓటమిపాలైనప్పటికీ.. ఉమేశ్‌ యాదవ్‌ మాత్రం తన అద్భుత ప్రదర్శనతో అకట్టుకున్నాడు. కాగా ఇటీవలే ఉమేశ్ యాదవ్ తండ్రి తిలక్ యాదవ్(74) అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే.
చదవండి: Saeed Anwar-PM Modi: ప్రధాని మోదీపై పాక్‌ మాజీ క్రికెటర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు.. 'సైతాన్‌' అంటూ..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement