ఆస్ట్రేలియాతో వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌కు ఫైనల్‌కు ముందు టీమిండియాను గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే స్టార్ ఆటగాళ్లు జస్ప్రీత్ బుమ్రా, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ దూరం.. ఇప్పుడు మరో కీలక పేసర్ ఉమేశ్ యాదవ్ గాయపడ్డాడు. ఉమేశ్ ప్రస్తుతం ఐపీఎల్-2023లో కోల్‌కతా నైటరైడర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఉమేష్ యాదవ్ మోకాలికి గాయమైంది. గాయం తీవ్రమైనది కావడంతో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌కు ఉమేష్ దూరమయ్యాడు. అతడు ఈ ఏడాది సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లకు కూడా దూరమయ్యే ఛాన్స్ ఉంది. ఒక వేళ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ఉమేష్ ఫిట్‌నెస్ సాధించకపోతే భారత జట్టుకు గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పుకోవాలి.
ఇక లండన్ ఓవల్ వేదికగా జూన్7 నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది. ఇప్పటికే ఇరు క్రికెట్ బోర్డులు తమ జట్లను ప్రకటించాయి. భారత జట్టులో అనూహ్యంగా వెటరన్ ఆటగాడు అజింక్యా రహానేకు చోటు దక్కింది.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, పుజారా, విరాట్ కోహ్లి, అజింక్య రహానే, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్, అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, సిరాజ్, ఉమేశ్ యాదవ్, ఉనద్కత్
చదవండి:Ind Vs Aus WTC 2023: టీమిండియా ఆల్‌రౌండర్‌కు బంపరాఫర్.. పాపం సూర్యకుమార్!
Comments
Please login to add a commentAdd a comment