PC: IPL. com
ఐపీఎల్-2022 మెగా వేలంలో టీమిండియా వెటరన్ పేసర్ ఉమేశ్ యాదవ్‌ను రూ. 2 కోట్లకు కోల్‌కతా నైట్‌రైడర్స్ కొనుగోలు చేసింది. కాగా 2014 సీజన్‌లో కేకేఆర్‌కు ఉమేశ్ యాదవ్ ప్రాతినిద్యం వహించాడు. ఆ సీజన్‌లో కేకేఆర్ టైటిల్ కైవసం చేసుకుంది. . గత ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్ తరుపన ఆడిన ఉమేశ్ యాదవ్ అంతగా రాణించ లేకపోయాడు. అయితే ఈ ఏడాది సీజన్‌లో కేకేఆర్ తరపున సత్తా చాటాలని యాదవ్ భావిస్తున్నాడు.
కేకేఆర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోలో ఉమేశ్ యాదవ్ మాట్లాడుతూ... "తిరిగి కేకేఆర్ జట్టులోకి వచ్చినందుకు సంతోషంగా ఉంది. 2014 సీజన్‌లో మేము ట్రోఫీని గెలిచాము. అప్పుడు నేనే జట్టులో భాగమై ఉన్నాను. కేకేఆర్ నాకు లక్కీ టీమ్. ఇక నా ఫ్యామిలీ నాతోనే ఇక్కడే ఉంది. కాబట్టి మూడు రోజుల క్వారంటైన్ సులభంగా గడిచిపోతుంది. ఇక నా ఫిట్‌నెస్ గురించి ఎటువంటి సమస్యలేదు. నేనే బాగానే ఉన్నాను. కాబట్టి ఈ సీజన్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాను.
కేకేఆర్ జట్టు కోసం నా వంతు కృషి చేస్తాను. మరోసారి కేకేఆర్‌కు ట్రోఫీని అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాను"అని ఉమేశ్ యాదవ్ పేర్కొన్నాడు. ఇక ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ ప్యాట్ కమ్మిన్స్ ఆరంభ మ్యాచ్‌లకు దూరం కావడంతో యాదవ్‌కు తుది జట్టులో చోటు దక్కడం ఖాయమనిపిస్తోంది. కాగా మార్చి 26 నుంచి ఐపీఎల్-2022 ప్రారంభం కానుంది. ఇక ఈ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తన తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో మార్చి 26న ఆడనుంది.
చదవండి: IPL 2022: సీఎస్‌కే స్టార్ ఆల్‌రౌండర్‌కు వీసా సమస్య.. తొలి మ్యాచ్‌కు దూరం!
Comments
Please login to add a commentAdd a comment