న్యూఢిల్లీ: తనకు వరుసగా అవకాశాలు ఇవ్వకపోవడంపై టీమిండియా పేసర్ ఉమేశ్ యాదవ్ తీవ్ర అసంతృప్తితోనే ఉన్న విషయం అతని మాటల ద్వారానే తెలుస్తోంది. ఇక్కడ తన అవకాశాలు ఇవ్వని అంశాన్ని వేలెత్తి చూపిన ఉమేశ్.. అసలు తనకు చాలినంత పనే లేదన్నాడు. ఈ విషయంలో తన వర్క్‌లోడ్ గురించి మాట్లాడే పెద్దలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ జోక్‌లు పేల్చుతూనే తన మనసులోని మాటను వెళ్లగక్కాడు. (నువ్వెంత ఇచ్చావ్’ అనడం దారుణం)
‘నన్ను సెలక్టర్లు వన్డేల్లో సరిగా ఉపయోగించుకోవడం లేదు. నాకు విశ్రాంతి ఇచ్చిన తర్వాత వన్డే ఆడటానికి ఆరు నెలలు నిరీక్షించాల్సి వచ్చింది. ఇది కచ్చితంగా కష్టమే. నా కెరీర్ ఎప్పుడూ నిలకడగా లేదు. 2015 వరల్డ్‌కప్‌లో నా బౌలింగ్ బాగానే ఉంది. కానీ ఆ తర్వాత చాలాకాలం తప్పించారు. అది ఎందుకో నాకు అర్థం కావడం లేదు. ఎక్కడా వైట్ బాల్ క్రికెట్.. రెడ్ బాల్ క్రికెట్ అనే సమస్య ఉండదు. రెండు బంతుల్లో స్వింగ్ ఉంటుంది. నేను ఆ పని చేయగలను. అంతకుముందు చేశాను కూడా. ఒక వన్డే సిరీస్ అంతా నాకు అవకాశం ఇస్తే నేను ఏమిటో నిరూపించుకునే అవకాశం మళ్లీ దొరుకుతుంది. ఇక్కడ నేను ఎవర్నీ తప్పుబట్టడం లేదు. వర్క్‌లోడ్ అంటూ తప్పిస్తున్నారు. కానీ నాకు సరైన పనే లేదనేది నా భావన’ అంటూ ఉమేశ్ చురకలంటించాడు. (వేలంలో ‘బ్లాక్ మాంబా’ టవల్‌కు భారీ ధర)
టీమిండియా తరఫున 46 టెస్టులాడిన ఉమేశ్ యాదవ్ 144 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 28 మ్యాచ్‌లను భారత్ గడ్డపై ఆడి 96 వికెట్లు తీసిన ఈ పేసర్.. మిగిలిన 18 మ్యాచ్‌లను విదేశీ గడ్డపై ఆడి 48 వికెట్లు తీశాడు. దీంతో.. విదేశాల్లో ఉమేశ్ రాణించలేడనే ముద్ర పడిపోయింది. ఇక 75 వన్డేలు ఆడిన ఉమేశ్.. 106 వికెట్లు తీశాడు. 2018 నుంచి చూస్తే ఉమేశ్ ఆడిన వన్డేలు నాలుగు మాత్రమే. ఆ కాలంలో టీమిండియా 54 వన్డేలు ఆడింది.
Comments
Please login to add a commentAdd a comment