Umesh Yadav: టీమిండియా వెటరన్ పేసర్ ఉమేశ్ యాదవ్‌కు బంపర్ ఆఫర్ లభించింది. పాకిస్థాన్ స్టార్ పేసర్ షాహిన్ అఫ్రిది స్థానంలో ఇంగ్లండ్ కౌంటీ టీమ్ మిడిల్‌సెక్స్ అతనితో ఒప్పందం కుదుర్చుకుంది. వ్యక్తిగత కారణాల చేత అఫ్రిది జట్టును వీడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మిడిల్‌సెక్స్ యాజమాన్యం సోమవారం (జులై 11) ప్రకటించింది. ఉమేశ్.. 2022 డొమెస్టిక్ సీజన్‌తో పాటు కౌంటీ ఛాంపియన్షిప్, వన్డే కప్‌లకు అందుబాటులో ఉంటాడని మిడిల్‌సెక్స్ పేర్కొంది.
ఓవర్‌సీస్ బౌలర్ కోటాలో ఉమేశ్ లాంటి బౌలర్ కోసమే తాము ఎదురుచూశామని, ఎట్టకేలకు తమకు సుదీర్ఘ అంతర్జాతీయ అనుభవం ఉన్న ఆటగాడే దొరికాడని తెలిపింది. పేస్‌తో పాటు వైవిధ్యం కలిగిన ఉమేశ్ చేరడం తమకు భారీ ప్రయోజనం చేకూరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది.
కాగా, టీమిండియాలో యువ పేసర్ల హవా పెరగడంతో గత కొంతకాలంగా ఉమేశ్‌కు అవకాశాలు రావడం లేదు. ఈ ఏడాది ఐపీఎల్‌లో (కేకేఆర్) అంచనాలకు మించి రాణించినా అతనికి టీమిండియా నుంచి పిలుపు రాలేదు. ఉమేశ్.. తన సహచరుడు పుజారాలా కౌంటీల్లో సత్తా చాటి టీమిండియాలోకి పునరాగమనం చేయాలని భావిస్తున్నాడు. టీమిండియా తరఫున 52 టెస్ట్‌లు, 77 వన్డేలు, 7 టీ20 ఆడిన ఉమేశ్.. ఓవరాల్‌గా 273 వికెట్లు పడగొట్టాడు.
చదవండి: కంగారూలను ఖంగుతినిపించిన లంకేయులు.. ఇన్నింగ్స్ తేడాతో ఘన విజయం
Comments
Please login to add a commentAdd a comment