
'కంగారు' పడ్డారు
► తొలి రోజు భారత్ ఆధిపత్యం
► ఆదుకున్న రెన్ షా, మిషెల్ స్టార్క్
► ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 256/9
► ఉమేశ్‌కు నాలుగు వికెట్లు
భారత పర్యటన మును్మందు ఎంత కఠినంగా సాగబోతోందో ఆస్ట్రేలియా జట్టుకు టెస్టు సిరీస్ తొలి రోజే స్పష్టంగా అర్థమయ్యంది. తొలి సెషన్ లో.. ఫర్లేదు బాగానే ఆడుతున్నారే.. అనుకునేంతలో భారత బౌలర్లు విరుచుకుపడ్డారు. ముఖ్యంగా పేసర్ ఉమేశ్ యాదవ్ రివర్స్ స్వింగ్ దెబ్బకు కంగారూ బ్యాట్స్‌మెన్ ఒక్కొక్కరు తోకముడిచారు. అటు స్పిన్నర్లు అశ్విన్, జడేజా తమ వంతు సహకారం అందించడంతో భారత్ తొలి రోజే స్పష్టవైున ఆధిక్యాన్ని ప్రదర్శించగలిగింది.
ప్రత్యర్థి ఆటగాళ్లలో చాలామందికి ఇక్కడ ఆడిన అనుభవం లేకపోవడాన్ని భారత బౌలర్లు చక్కగా సద్వినియోగం చేసు కున్నారు. ఇక మొదటిసారి భారత టూర్‌కు వచ్చిన 20 ఏళ్ల ఓపెనర్ రెన్ షా సమయోచిత ఆటతో ఆకట్టుకోగా... టెయిలెండర్ మిషెల్ స్టార్క్ చివర్లో అనూహ్య రీతిలో ఎదురుదాడికి దిగాడు. దీంతో ఆసీస్ 250 పరుగులైనా దాటగలిగింది. వీరిద్దరి బ్యాటింగ్ మినహా తొలి రోజు ఆసీస్ సాధించిందేమీ లేదు.
పుణే: ఆస్ట్రేలియా జట్టుకు తొలి రోజే భంగపాటు ఎదురైంది. పదమూడేళ్లుగా భారత గడ్డపై తమను ఊరిస్తున్న విజయాన్ని ఎలాగైనా సాధించి తీరాలనే కసితో సిరీస్‌ను ఆరంభించిన స్మిత్ బృందానికి భారత బౌలర్లు గట్టి షాకే ఇచ్చారు. పేసర్ ఉమేశ్ యాదవ్ (4/32) నిప్పులు చెరిగే బంతులకు ఆసీస్ బ్యాట్స్‌మెన్ దగ్గర సమాధానం లేకుండా పోయింది. ఫలితంగా నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా జరుగుతున్న తొలి టెస్టులో తొలి రోజు గురువారం ఆట ముగిసే సమయానికి ఆసీస్ 94 ఓవర్లలో 9 వికెట్లకు 256 పరుగులు చేసింది.
ఓపెనర్లు మాట్ రెన్ షా (156 బంతుల్లో 68; 10 ఫోర్లు, 1 సిక్స్), డేవిడ్ వార్నర్ (77 బంతుల్లో 38; 6 ఫోర్లు) శుభారంభాన్ని అందించినా మిగతా బ్యాట్స్‌మెన్ సద్వినియోగం చేసుకోలేకపోయారు. వార్మప్ మ్యాచ్‌లో సెంచరీలతో చెలరేగిన స్మిత్ (95 బంతుల్లో 27; 2 ఫోర్లు), షాన్ మార్ష్ 55 బంతుల్లో 16; 3 ఫోరు్ల)త్వరగానే పెవిలియన్ కు చేరారు.
అయితే తొలి రోజే బ్యాటింగ్‌కు దిగుదామని భావించిన భారత్ ఆశలపై చివర్లో మిషెల్ స్టార్క్ (58 బంతుల్లో 57 బ్యాటింగ్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) నీళ్లు చల్లాడు. మరో వికెట్ పడితే ఆలౌట్ ఖాయమయ్యే పరిస్థితిలో స్టార్క్ దూకుడు బ్యాటింగ్‌తో ఆసీస్ గౌరవప్రదవైున స్కోరు సాధించగలిగింది. మరోవైపు స్టార్క్‌కు హాజెల్‌వుడ్ (31 బంతుల్లో 1 బ్యాటింగ్) ఓపిగ్గా సహకారం అందిస్తున్నాడు. వీరిద్దరి మధ్య ఇప్పటికే పదో వికెట్‌కు అజేయంగా 55 పరుగులు జత చేరాయి. స్పిన్నర్లు అశ్విన్ , రవీంద్ర జడేజాలకు రెండేసి వికెట్లు దక్కాయి.
రెన్ షా ‘ఇంటర్వెల్’
క్రికెట్ మ్యాచ్‌ల్లో డ్రింక్స్ బ్రేక్, లంచ్ బ్రేక్, స్ట్రాటజిక్ బ్రేక్ కామన్ ... కానీ గతంలో లేని గమ్మత్తు బ్రేక్ ఆస్ట్రేలియా ఓపెనర్ రెన్ షా తీసుకున్నాడు. అదే ‘టాయిలెట్ బ్రేక్’! తొలి రోజు ఆటలో భోజన విరామానికి ముందు అతనికి ఈ విరామం తప్పనిసరైంది. వార్నర్ ఔటైన తర్వాత లంచ్ బ్రేక్‌కు ఇంకా ఎంత సమయముందని ఫీల్డ్ అంపైర్ రిచర్డ్ కెటిల్‌బొరొను అడిగాడు. అర గంటని చెప్పడంతో ఇక నా వల్ల కాదు... దయచేసి బ్రేకివ్వండి అంటూ కోరాడు.
ఆసీస్ కెప్టెన్ స్మిత్ కూడా ఊహించని ఈ హఠాత్పరిణామాన్ని కాదనలేకపోవడంతో గతంలో ఎన్నడు లేని విధంగా ఆ ‘అవసరం’ కోసం క్రీజు వదిలాడు రెన్ షా. దీనిపై తొలిరోజు ఆట ముగిశాక అతను వివరణ ఇచ్చాడు. ‘వార్నర్ ఔట్ కాకముందే... అంటే ఐదు, పది నిమిషాల ముందే కడుపులో సడెన్ గా అలజడి మొదలైంది. దీంతో అతను ఔటైన వెంటనే అంపైర్‌ను, కెప్టెన్ ని అడిగి వెళ్లాల్సివచ్చింది. నా పరిస్థితి అర్థం చేసుకున్న స్మిత్‌కు కృతజ్ఞతలు’ అని రెన్ షా తెలిపాడు. మరోవైపు ఆస్ట్రేలియా మాజీ సారథి అలెన్ బోర్డర్ మాత్రం రెన్ కారణాన్ని తప్పుబట్టారు. ఆటనుంచి అర్ధంతరంగా వెళ్లిరావడం సమంజసంగా లేదన్నారు. తానే కెప్టెన్ అయి ఉంటే అసలు వెళ్లనిచ్చేవాడిని కాదన్నారు.
తొలి సెషన్ : ఓపెనర్ల నిలకడ
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా ఓపెనర్లు రెన్ షా, వార్నర్ నిలకడైన ఆటతీరును కనబరిచారు. కెరీర్లో ఐదో టెస్టు ఆడుతున్న రెన్ షా పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. ఇషాంత్ వేసిన ఇన్నింగ్స్ తొలి బంతినే బౌండరీగా మలిచాడు. అలాగే జయంత్ యాదవ్ ఓవర్‌లో వార్నర్ రెండు ఫోర్లతో జోరు చూపించాడు. రెండో ఓవర్లనే అశ్విన్ ను బౌలింగ్‌కు దించిన భారత వ్యూహం ఫలించలేదు. అతను వేసిన మరో ఓవర్‌లో రెన్ అప్పీల్‌పై రివూ్యకు వెళ్లినా నిరాశే ఎదురైంది.
15వ ఓవర్‌లో వార్నర్‌ను జయంత్ బౌల్డ్ చేసినా అది నోబాల్‌గా తేలింది. ఇద్దరూ చాలా ఓపిగ్గా ఆడుతూ భారత్‌ను విసిగిస్తున్న తరుణంలో ఉమేశ్ యాదవ్ జట్టుకు రిలీఫ్ అందించాడు. ఇన్నింగ్స్ 28వ ఓవర్‌లో కోహ్లి ఉమేశ్‌ను బౌలింగ్‌కు దింపాడు. ఇదే ఓవర్‌లో తను వార్నర్‌ను అదు్భత బంతితో బౌల్డ్ చేశాడు. చక్కటి లైన్ అండ్ లెంగ్‌్తతో విసిరిన ఆ బంతి స్టంప్‌ను గిరాటేసింది. ఆ వెంటనే రెన్ షా ‘కడుపునొప్పి’తో మైదానాన్ని వీడగా... స్మిత్, మా ర్ష్ మరో ఐదు ఓవర్లపాటు వికెట్ కోల్పోకుండా జాగ్రత్తగా ఆడారు.
ఓవర్లు: 33, పరుగులు: 84, వికెట్లు: 1
రెండో సెషన్ : వికెట్లు టపటపా
లంచ్ విరామం అనంతరం ఆసీస్ ఒక్కసారిగా తడబడింది. 119/1 స్కోరుతో పటిష్టంగా కనిపించిన జట్టు వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయింది. బ్యాట్స్‌మెన్ నిలకడగా కుదురుకోకుండా కెపె్టన్ తమ స్పిన్నర్లను రొటేట్ చేశాడు. ఓపిగ్గా ఆడుతున్న షాన్ మా ర్ష్ ను జయంత్ యాదవ్ అవుట్ చేశాడు. స్వీప్ షాట్ ఆడేందుకు యత్నించిన మార్ష్ విఫలం కాగా బంతి కోహ్లి చేతులో్లకి వెళ్లింది.
ఆ తర్వాత కొద్దిసేపటికి వరుస ఓవర్లలో హ్యాండ్స్‌కోంబ్ (45 బంతుల్లో 22; 3 ఫోరు్ల)ను జడేజా... కెపె్టన్ స్మిత్‌ను అశ్విన్ పెవిలియన్ కు చేర్చడంతో ఆసీస్ ఒక్కసారిగా ఇబ్బందుల్లో పడింది. అదే ఓవర్‌లో మిషెల్ మార్ష్ ను అశ్విన్ అవుట్ చేసినా రివూ్యలో అది తప్పని తేలింది. హ్యాండ్స్‌కోంబ్ అవుట్ కాగానే రెన్ షా తిరిగి బ్యాటింగ్‌కు వచ్చాడు.
ఓవర్లు:30, పరుగులు: 69, వికెట్లు: 3
చివరి సెషన్ : ఉమేశ్ హవా
టీ బ్రేక్ తర్వాత స్పిన్నర్లు జడేజా, అశ్విన్ , జయంత్ యాదవ్ బౌలింగ్‌ను రెన్ షా సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. బౌండరీలతో స్కోరును పెంచేందుకు ప్రయత్నించాడు. మిషెల్ మా ర్ష్ (4)ను జడేజా ఎల్బీగా అవుట్ చేయగా అటు రెన్ షా మాత్రం తన జోరు సాగించాడు. 125 బంతుల్లో ఓ బౌండరీతో అర్ధ సెంచరీ సాధించాడు. అయితే పాత బంతితో ఉమేశ్ అదు్భత రివర్స్ స్వింగ్‌తో ఫలితం రాబటా్టడు. స్వల్ప స్కోరుకే వేడ్ (8)ను ఎల్బీగా అవుట్ చేశాడు.
మరో మూడు ఓవర్లకు ఆసీస్‌కు గట్టి దెబ్బ తగిలింది. నిలకడగా ఆడుతున్న రెన్ షాను అశ్విన్ అవుట్ చేశాడు. ఇక 82వ ఓవర్‌లో ఉమేశ్ మరోసారి రెచ్చిపోయి వరుస బంతుల్లో ఓ కీఫ్, లియోన్ లను డకౌట్‌లుగా వెనక్కి పంపాడు. ఇందులో ఓ కీఫ్ ఇచ్చిన క్యాచ్‌ను కీపర్ సాహా అత్యద్భుతంగా డైవ్ చేసి పట్టుకున్నాడు. దీంతో 205 పరుగులకు 9 వికెట్లు కోల్పోయిన ఆసీస్‌కు స్టార్క్ అండగా నిలిచాడు. తానెదుర్కొన్న రెండో బంతినే సిక్సర్‌గా మలిచాడు. జడేజా వేసిన 88వ ఓవర్‌లో రెండు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 15 పరుగులు సాధించిన తను 47 బంతులో్లనే అర్ధ సెంచరీ చేశాడు. అలాగే టెస్టుల్లో వెయ్యి పరుగులను పూర్తి చేసుకున్నాడు. హాజెల్‌వుడ్ సహకారంతో చివరి వికెట్ పడకుండా రోజును ముగించాడు.
ఓవర్లు: 31, పరుగులు: 103, వికెట్లు: 5
1 స్వదేశంలో ఓ ఇన్నింగ్స్‌లో ఉమేశ్ యాదవ్‌కు ఇదే (4/32) అత్యుత్తమ ప్రదర్శన
1 భారత గడ్డపై అతి చిన్న వయస్సులో (20 ఏళ్ల 332 రోజులు) అర్ధ సెంచరీ చేసిన ఆసీస్ ఆటగాడు రెన్ షా
స్కోరు వివరాలు:
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: రెన్ షా (సి) విజయ్ (బి) అశ్విన్ 68; వార్నర్ (బి) ఉమేశ్ యాదవ్ 38; స్మిత్ (సి) కోహ్లి (బి) అశ్విన్ 27; షాన్ మా ర్ష్ (సి) కోహ్లి (బి) జయంత్ యాదవ్ 16; హ్యాండ్స్‌కోంబ్ ఎల్బీడబ్ల్యూ (బి) జడేజా 22; మిషెల్ మార్ష్ ఎల్బీడబ్ల్యూ(బి) జడేజా 4; వేడ్ ఎల్బీడబ్ల్యూ(బి) ఉమేశ్ యాదవ్ 8; స్టార్క్ బ్యాటింగ్ 57; ఓకీఫ్ (సి) సాహా (బి) ఉమేశ్ యాదవ్ 0; లియోన్ ఎల్బీడబ్ల్యూ
(బి) 0; హాజెల్‌వుడ్ బ్యాటింగ్ 1; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (94 ఓవర్లలో 9 వికెట్లకు) 256.
వికెట్ల పతనం: 1–82, 2–119, 3–149, 4–149, 5–166, 6–190, 7–196, 8–205, 9–205.
బౌలింగ్: ఇషాంత్ 11–0–27–0; అశ్విన్ 34–10–59–2; జయంత్ యాదవ్ 13–1–58–1; జడేజా 24–4–74–2; ఉమేశ్ యాదవ్ 12–3–32–4