ఫైల్ ఫోటో
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ అనంతరం భారత్ జట్టు బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్‌లో భాగంగా టీమిండియా మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. డిసెంబర్4న జరగనున్న తొలి వన్డేతో భారత పర్యటన ప్రారంభం కానుంది. వన్డే సిరీస్ అనంతరం టెస్టు సిరీస్ జరగనుంది. అయితే ఈ కీలకమైన టెస్టు సిరీస్‌కు ముందు భారత "ఏ" జట్టు నాలుగు రోజుల టెస్టు మ్యాచ్ ఆడేందుకు బంగ్లాదేశ్‌లో పర్యటించనుంది.
అయితే బంగ్లాలో పర్యటించే ఏ జట్టుకు భారత వెటరన్ ఆటగాడు ఛెతేశ్వర్ పుజారా సారథ్యం వహించనున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా అతడితో పాటు ఉమేశ్ యాదవ్, శ్రీకర్ భరత్ కూడా ఈ జట్టులో భాగం కానున్నట్లు సమాచారం. ఇక ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్‌కు కూడా చోటు దక్కే అవకాశం ఉంది. కాగా బంగ్లాతో టెస్టు సిరీస్‌కు ప్రకటించిన జట్టులో ఈ ముగ్గురు సభ్యులుగా ఉన్నారు. ఇక చేతన్ శర్మ నేతృత్వంలోని కమిటీ రానున్న రోజుల్లో ఏ-జట్టును ప్రకటించనుంది. కాగా ఈ సిరీస్ నవంబర్ ఆఖరి వారంలో జరిగే అవకాశం ఉంది.
బంగ్లాదేశ్‌తో వన్డేలకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, శ్రేయాస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ , వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మొహమ్మద్. సిరాజ్, దీపక్ చాహర్, యష్ దయాల్
బంగ్లాదేశ్‌తో టెస్టులకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కెఎస్ భరత్ , రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్ , కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మొహమ్మద్. సిరాజ్, ఉమేష్ యాదవ్
చదవండి: బాబర్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటే మంచిది: అఫ్రిది
Comments
Please login to add a commentAdd a comment