bangla tour
-
బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్.. భారత-"ఏ" జట్టు కెప్టెన్‌గా పుజారా
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ అనంతరం భారత్ జట్టు బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా టీమిండియా మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. డిసెంబర్4న జరగనున్న తొలి వన్డేతో భారత పర్యటన ప్రారంభం కానుంది. వన్డే సిరీస్ అనంతరం టెస్టు సిరీస్ జరగనుంది. అయితే ఈ కీలకమైన టెస్టు సిరీస్‌కు ముందు భారత "ఏ" జట్టు నాలుగు రోజుల టెస్టు మ్యాచ్ ఆడేందుకు బంగ్లాదేశ్‌లో పర్యటించనుంది. అయితే బంగ్లాలో పర్యటించే ఏ జట్టుకు భారత వెటరన్ ఆటగాడు ఛెతేశ్వర్ పుజారా సారథ్యం వహించనున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా అతడితో పాటు ఉమేశ్ యాదవ్, శ్రీకర్ భరత్ కూడా ఈ జట్టులో భాగం కానున్నట్లు సమాచారం. ఇక ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్‌కు కూడా చోటు దక్కే అవకాశం ఉంది. కాగా బంగ్లాతో టెస్టు సిరీస్‌కు ప్రకటించిన జట్టులో ఈ ముగ్గురు సభ్యులుగా ఉన్నారు. ఇక చేతన్ శర్మ నేతృత్వంలోని కమిటీ రానున్న రోజుల్లో ఏ-జట్టును ప్రకటించనుంది. కాగా ఈ సిరీస్ నవంబర్ ఆఖరి వారంలో జరిగే అవకాశం ఉంది. బంగ్లాదేశ్‌తో వన్డేలకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, శ్రేయాస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ , వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మొహమ్మద్. సిరాజ్, దీపక్ చాహర్, యష్ దయాల్ బంగ్లాదేశ్‌తో టెస్టులకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కెఎస్ భరత్ , రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్ , కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మొహమ్మద్. సిరాజ్, ఉమేష్ యాదవ్ చదవండి: బాబర్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటే మంచిది: అఫ్రిది -
తొలి వన్డేలో నెగ్గిన టీమిండియా
-
భారత్ అలవోకగా...
తొలి వన్డేలో నెగ్గిన టీమిండియా 7 వికెట్లతో బంగ్లాదేశ్ చిత్తు రాణించిన రహానే, ఉతప్ప మిర్పూర్: సీనియర్లు లేకపోయినా... జట్టులో సత్తాకు కొదవ లేదని భారత యువ ఆటగాళ్లు నిరూపించారు. సమష్టి ప్రదర్శనతో బంగ్లా పర్యటనలో శుభారంభం చేశారు. ఆదివారం ఇక్కడి షేర్-ఎ-బంగ్లా స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో రైనా బృందం 7 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ (63 బంతుల్లో 59; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), షకీబ్ అల్ హసన్ (58 బంతుల్లో 52; 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు సాధించగా... అనాముల్ హక్ (60 బంతుల్లో 44; 7 ఫోర్లు), మహ్ముదుల్లా (44 బంతుల్లో 41; 6 ఫోర్లు) రాణించారు. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో భారత్ స్కోరు 16.4 ఓవర్లలో 100 పరుగులకు చేరిన దశలో భారీ వర్షం కురిసి మ్యాచ్‌కు చాలా సమయం పాటు అంతరాయం కలిగింది. ఆ తర్వాత డక్‌వర్త్ లూయీస్ నిబంధన ప్రకారం టీమిండియా లక్ష్యాన్ని 26 ఓవర్లలో 150 పరుగులుగా నిర్ణయించారు. టీమిండియా 24.5 ఓవర్లలో 3 వికెట్లకు 153 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అజింక్య రహానే (70 బంతుల్లో 64; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), రాబిన్ ఉతప్ప (44 బంతుల్లో 50; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) తొలి వికెట్‌కు 99 పరుగులు జోడించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. రెండో వన్డే మంగళవారం జరుగుతుంది. రసూల్‌కు అవకాశం... ఈ మ్యాచ్‌తో భారత్ తరఫున ఇద్దరు ఆటగాళ్లు అంతర్జాతీయ వన్డేల్లో అరంగేట్రం చేశారు. ఆల్‌రౌండర్ పర్వేజ్ రసూల్, లెఫ్టార్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్‌లకు ఆ అవకాశం దక్కింది. జమ్మూ కాశ్మీర్ తరఫున భారత్‌కు ఆడిన తొలి క్రికెటర్‌గా రసూల్ చరిత్ర సృష్టించాడు. మరోవైపు రాబిన్ ఉతప్ప ఆరేళ్ల విరామం తర్వాత భారత్ తరఫున వన్డే ఆడటం విశేషం. స్కోరు వివరాలు బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: తమీమ్ (సి) సాహా (బి) యాదవ్ 0; అనాముల్ (సి) రాయుడు (బి) రసూల్ 44; మోమినుల్ (సి) సాహా (బి) యాదవ్ 6; ముష్ఫికర్ (సి) రహానే (బి) రసూల్ 59; షకీబ్ (సి) అండ్ (బి) రైనా 52; మహ్ముదుల్లా (బి) మిశ్రా 41; నాసిర్ (సి) రహానే (బి) మిశ్రా 22; జియావుర్ (సి) రైనా (బి) యాదవ్ 2; మొర్తజా (బి) పటేల్ 18; రజాక్ (నాటౌట్) 16; అల్ అమీన్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 272 వికెట్ల పతనం: 1-5; 2-35; 3-87; 4-134; 5-199; 6-229; 7-234; 8-235; 9-267. బౌలింగ్: మోహిత్ శర్మ 5.4-1-23-0; ఉమేశ్ యాదవ్ 9-0-48-3; ఉతప్ప 0.2-0-0-0; అక్షర్ పటేల్ 10-0-59-1; మిశ్రా 10-0-55-2; రసూల్ 10-0-60-2; రైనా 5-0-24-1. భారత్ ఇన్నింగ్స్: ఉతప్ప (ఎల్బీ) (బి) షకీబ్ 50; రహానే (సి) జియావుర్ (బి) మొర్తజా 64; పుజారా (ఎల్బీ) (బి) షకీబ్ 0; రాయుడు (నాటౌట్) 16; రైనా (నాటౌట్) 15; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (24.5 ఓవర్లలో 3 వికెట్లకు) 153 వికెట్ల పతనం: 1-99; 2-100; 3-135. బౌలింగ్: మొర్తజా 5-0-25-1; అల్ అమీన్ 5-0-32-0; షకీబ్ 6-0-27-2; రజాక్ 5-0-34-0; జియావుర్ 1-0-9-0; మహ్ముదుల్లా 2.5-0-26-0.