
న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో చివరి రెండు టెస్టుల్లో తలపడే భారత జట్టులో సెలక్టర్లు ఒకే ఒక మార్పు చేశారు. అహ్మదాబాద్‌లో జరిగే ఈ మ్యాచ్‌లలో శార్దుల్ ఠాకూర్ స్థానంలో సీనియర్ సీమర్ ఉమేశ్ యాదవ్‌ను ఎంపిక చేశారు. అయితే ఉమేశ్‌ను తీసుకున్నప్పటికీ మ్యాచ్‌కు ముందే అతను తన ఫిట్‌నెస్ నిరూపించుకోవాల్సి వుంటుంది. షమీ వంద శాతం ఫిట్‌గా లేకపోవడంతో అతన్ని ఎంపిక చేయలేదు.
కాగా ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా రెండో టెస్ట్‌లో ఉమేష్ యాదవ్ గాయపడిన విషయం తెలిసిందే. కాలికి గాయం కావడంతో స్వదేశానికి తిరిగి వచ్చాడు. ఇక ఆసీస్ టూర్‌లో రెండు టెస్టులాడిన ఉమేశ్ నాలుగు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఇదిలా ఉంటే.. టీమిండియా నుంచి రిలీజ్ అయిన శార్దూల్ ఠాకూర్ విజయ్ హజారే ట్రోఫీలో ఆడనున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment