
అక్టోబర్ 25న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 7.
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: సోనీ రాజ్‌దాన్ (నటి, దర్శకురాలు), మోనికా డోగ్రా (నటి, సింగర్), ఉమేష్ యాదవ్ (క్రికెటర్)
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 7. పుట్టిన తేదీ 25. ఇది కేతు సంఖ్య కావడం వల్ల వీరిపై ఈ సంవత్సరమంతా కేతుగ్రహప్రభావం బలంగా ఉంటుంది. దీనివల్ల ఆధ్యాత్మికోన్నతి సాధిస్తారు. ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. ఇంటాబయటా వీరి మాటకు విలువ ఏర్పడుతుంది. వేదపండితులు, జ్యోతిష్యులు, తాంత్రిక విద్యలలో ప్రవేశం ఉన్న వారికి మంచి గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు వస్తాయి.
సంతానప్రాప్తి కలుగుతుంది. కేతుగ్రహ ప్రభావం వల్ల వీరు ఈ సంవత్సరమంతా ఆధ్యాత్మిక చిం తన, తాత్వికత, అతీంద్రియ శక్తులను నేర్చుకోవడం వంటి వాటిపై మొగ్గు చూపుతారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. చాలాకాలంగా దూరంగా ఉన్న బంధువులను, స్నేహితులను కలుస్తారు. విద్యార్థులకు విదేశాలలో చదువుకోవాలనే కోరిక, ఉద్యోగులకు విదేశాలలో ఉద్యోగాలు చేయాలనే కోరిక తీరతాయి. ఉద్యోగులకు కోరుకున్న చోటికి బదిలీ అవుతుంది. వైద్యవిద్యార్థులకు, వైద్యులకు బాగా పేరు వస్తుంది. అయితే ప్రాపంచిక విషయాలపై ఆసక్తి తగ్గడం వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించే ప్రమాదం ఉంది.
లక్కీ నంబర్స్: 1,2,6,7; లక్కీ కలర్స్: వైట్, క్రీమ్, గోల్డెన్, గ్రే, శాండల్ , బ్లూ; లక్కీ డేస్: ఆది, సోమ, శుక్రవారాలు. సూచనలు: భూమిని, ఇంటిని అమ్మాలనే ఆలోచన వచ్చినప్పటికీ ఆ ప్రయత్నాన్ని విరమించుకోవడం మంచిది. ప్రాపంచిక జీవనంపై దృష్టి పెట్టడం, గణపతి హోమం లేదా కేతు గ్రహ జపం చేయించుకోవడం, పండితులను, గురువులను గౌరవించడం, వికలాంగులను ఆదరించడం.
- డాక్టర్ మహమ్మద్ దావూద్, న్యూమరాలజిస్ట్