
ఉమేష్ యాదవ్ అద్భుత క్యాచ్
న్యూజిలాండ్ తో ఇక్కడ జరుగుతున్న తొలి వన్డేలో భారత ఆటగాడు ఉమేష్ యాదవ్ అద్భుత క్యాచ్ను అందుకున్నాడు.
ధర్మాశాల:న్యూజిలాండ్ తో ఇక్కడ జరుగుతున్న తొలి వన్డేలో భారత ఆటగాడు ఉమేష్ యాదవ్ అద్భుత క్యాచ్ను అందుకున్నాడు. హార్దిక్ పాండ్యా వేసిన ఇన్నింగ్స్ 10 ఓవర్ నాల్గో బంతిని కోరీ అండర్సన్ మిడాఫ్ మీదుగా షాట్ ఆడాడు. అవుట్ సైడ్ ఆఫ్ స్టంట్ వేసిన బంతిని అండర్సన్ షాట్ కొట్టి ఫోర్ కు పంపించే యత్నం చేశాడు.
అయితే మిడాఫ్ లో ఫీల్డింగ్ చేస్తున్న ఉమేష్ ఎవరూ ఊహించని విధంగా డైవ్ కొట్టి క్యాచ్ ను అందుకున్నాడు. ఉమేష్ యాదవ్ ఆ తరహా క్యాచ్ అందుకోవడంతో అటు జట్టులోని సభ్యులు, ఇటు స్టేడియంలోని ప్రేక్షకులు ఆశ్చర్యపోవడమే కాకుండా ఆనందంలో మునిగితేలారు. ఉమేష్ మెరుపులాంటి క్యాచ్ కు అండర్సన్ సైతం ఆశ్చర్యపోయి నిరాశగా పెవిలియన్ కు చేరాడు.