డబ్లిన్: దాదాపు ఆరేళ్ల తర్వాత టీమిండియా పేసర్ ఉమేశ్ యాదవ్ రెండో అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడాడు. 2012లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ ద్వారా టీ20 ఫార్మాట్‌లోకి టీమిండియా తరపున అరంగేట్రం చేసిన ఉమేశ్.. సుదీర్ఘ కాలం తర్వాత మరొకసారి జట్టులో చోటు దక్కించుకున్నాడు. శుక్రవారం ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా ఉమేశ్ యాదవ్ మరొకసారి టీ20 మ్యాచ్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఓవరాల్‌గా చూస్తే ఉమేశ్ యాదవ్‌కు ఇది రెండో అంతర్జాతీయ టీ20 మ్యాచ్ మాత్రమే.
ఈ మ్యాచ్‌లో ఉమేశ్ యాదవ్ రెండు వికెట్లు తీసి 19 పరుగులు ఇచ్చాడు. తన ప‍్రదర్శనపై సంతోషం వ్యక్తం చేసిన ఉమేశ్.. భారత జట్టులో స్థానం దక్కించుకోవడం అంత ఈజీ కాదని అంటున్నాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టీమిండియా జట్టులో చోటు సంపాదించడం అత్యంత కష్టమన్నాడు. భారత జట్టు పేస్ బౌలింగ్ విభాగంలో భువనేశ్వర్, మహ్మద్ షమీ, బూమ్రాలతో సమతుల‍్యంగా ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా ఉమేశ్ ప్రస్తావించాడు. ఐర్లాండ్‌పై మెరుగైన ప్రదర్శన చేయడానికి ఐపీఎల్ ఎంతగానో ఉపయోగపడిందన్నాడు. అసలు ఆరేళ్ల తర్వాత భారత టీ20 జట్టులో మళ్లీ చోటు దక్కించుకోవడానికి ఐపీఎలే కారణమన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment