దక్షిణాఫ్రికాతో జరుగనున్న మిగిలిన రెండు వన్డేలకు, తొలి రెండు టెస్టులకు భారత క్రికెట్ జట్టును ఎంపిక చేశారు. ఈ మేరకు సోమవారం చీఫ్ సెలెక్టర్ సందీప్ పాటిల్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ సమావేశమైంది. చివరి రెండు వన్డేలకు పేసర్ ఉమేష్ యాదవ్ ను పక్కకు పెట్టగా, కర్ణాటక పేసర్ శ్రీనాథ్ అరవింద్ కు చోటు కల్పించారు. ఈ ఒక్క మార్పు మినహా వన్డే జట్టును యథాతధంగా కొనసాగించాలని సెలెక్షన్ కమిటీ నిర్ణయించింది.