
వెస్టిండీస్‌తో హైదరాబాద్ వేదికగా జరిగిన రెండో టెస్టులో పది వికెట్లతో అదరగొట్టిన పేసర్ ఉమేశ్ యాదవ్‌కు భారత వన్డే జట్టులోకి పిలుపొచ్చింది. శార్దుల్ ఠాకూర్ గాయం కారణంగా దూరమవడంతో అతని స్థానంలో ఉమేశ్ ఎంపికయ్యాడు.
ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి రెండు వన్డేల కోసం 14 మందితో కూడిన భారత జట్టును ప్రకటించారు. అందులో శార్దుల్ ఠాకూర్ గాయం కారణంగా మొత్తం సిరీస్‌కు దూరం కావడంతో అతని స్థానంలో సెలక్టర్లు ఉమేశ్‌ను ఎంపిక చేశారు.