India vs Australia- WTC Final: ‘‘నేను ప్రతి విషయంలోనూ నిక్కచ్చిగా.. నిజాయితీగా ఉంటాను. జట్టులో చోటు దక్కించుకునేందుకు చేయాల్సిన దాంట్లో కనీసం 10 శాతం కూడా సాధించలేదు. పది దాకా ఎందుకు.. కనీసం ఒక్క శాతం కూడా నేను అందుకు అర్హుడిని కాను. అలాంటిది.. ఇప్పటికిప్పుడు జట్టులోకి వచ్చి వేరే వాళ్ల స్థానాన్ని ఆక్రమించలేను కదా! అది సరైంది కాదు కూడా!’’ అని టీమిండియా తాత్కాలిక కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్నాడు.
లేదు.. ఆ ఆలోచనే లేదు!
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ నేపథ్యంలో రోహిత్ శర్మ గైర్హాజరీలో స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మొదటి మ్యాచ్‌కు సారథ్యం వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన పాండ్యాకు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ గురించి ప్రశ్న ఎదురైంది. ఐపీఎల్-2023 తర్వాత జరుగబోయే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు మీరు అందుబాటులో ఉంటారా అన్న ప్రశ్నకు బదులుగా.. ‘‘లేదు’’ అని హార్దిక్ స్పష్టం చేశాడు.
అసలు ఇప్పట్లో టెస్టు జట్టులో చోటు గురించి అసలు తనకు ఆలోచనే లేదని కుండబద్దలు కొట్టాడు. కాగా 2017 జూలైలో శ్రీలంకతో మ్యాచ్ సందర్భంగా అంతర్జాతీయ టెస్టుల్లో అడుగుపెట్టిన ఈ పేస్ ఆల్‌రౌండర్.. 2018లో ఇంగ్లండ్‌తో ఆడిన టెస్టు ఆఖరిది. అప్పటి నుంచి ఇంతవరకు అతడు టెస్టు మ్యాచ్ ఆడలేదు.
పేస్ ఆల్‌రౌండర్ కావాలి కదా! పోటీలో లేను
ఇక ఇప్పుడు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భవిష్య కెప్టెన్‌గా ఎదుగుతున్న 29 ఏళ్ల పాండ్యా.. ఇప్పటికే పలు టీ20 సిరీస్‌లకు సారథ్యం వహించి పలు విజయాలు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో టెస్టుల్లో అతడి రీఎంట్రీ గురించి చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే.. స్వదేశంలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 సిరీస్‌లో ఆస్ట్రేలియాపై విజయం సాధించిన టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ఇంగ్లండ్ వేదికగా జూన్ 7-11 వరకు ఫైనల్ ఆడనుంది. ఈ నేపథ్యంలో పేస్ ఆల్‌రౌండర్ ఆవశ్యకత గురించి కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడగా.. శార్దూల్ ఠాకూర్ ప్రస్తావన వచ్చింది. విదేశాల్లో ముఖ్యంగా ఆసీస్‌పై అతడికి మంచి రికార్డే ఉంది. ఈ నేపథ్యంలో డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టు కూర్పుపై ప్రశ్న ఎదురుకాగా.. హార్దిక్ పాండ్యా ఇలా తాను పోటీలో లేనంటూ క్లారిటీ ఇచ్చాడు.
చదవండి: Ind Vs Aus: అప్పటి మ్యాచ్‌లో విజయం వాళ్లదే! కానీ ఈసారి.. పిచ్ ఎలా ఉందంటే!
Rishabh Pant: ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నాడు! పంత్‌ను కలిసిన యువీ.. ఫొటో వైరల్
Comments
Please login to add a commentAdd a comment