
PC: IPL.com
టీమిండియా వెటరన్ పేసర్, కోల్‌కతా నైట్‌రైడర్స్ స్టార్ బౌలర్ ఉమేశ్ యాదవ్ ఐపీఎల్-2022లో అదరగొడుతున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 6 మ్యాచ్‌లు ఆడిన ఉమేశ్ 10 వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా ఉమేశ్ పంజాబ్ కింగ్స్‌పై నాలుగు వికెట్లు పడగొట్టి కేకేఆర్‌కు అద్భుతమైన విజయం అందించాడు. కాగా తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉమేశ్ యాదవ్ తన మనసులోని మాటను బయటపెట్టాడు.
"భారత ప్రపంచకప్ జట్టులో చోటు కోసం అలోచించడం లేదు. అదింతా సెలెక్టర్లు, టీమ్ మేనేజ్‌మెంట్‌పై ఆధారపడి ఉంటుంది. అయితే టీ20 ప్రపంచకప్‌కు ముందు భారత్ అనేక వైట్ బాల్ సిరీస్‌లు ఆడనుంది. నేను మొదట ఆ జట్టులో చోటు దక్కించుకుని అక్కడ అద్భుతంగా రాణించాలి. అప్పడే టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు గురించి ఆలోచిస్తా. కానీ ఒక క్రికెటర్‌గా నాకు దొరికిన చిన్న అవకాశాన్నికూడా అందిపుచ్చుకుంటాను" అని ఉమేశ్ యాదవ్ పేర్కొన్నాడు.
చదవండి: IPL 2022 CSK Vs GT: "వెల్‌కమ్ బ్యాక్ రుత్‌రాజ్.. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడావు"