ఎండ్రకాయలతో షాకిచ్చిన క్రికెటర్
వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులకు షాకిచ్చాడు. కరీబియన్ దీవుల్లో దొరికే ఎండ్రకాయలను పట్టుకుని ఫోటోకు ఫోజిచ్చాడు. చూడటానికి భారీ ఆకారంలో ఉన్న ఎండ్రకాయలను చూసిన ఉమేశ్ ఫాలోవర్లలో కొందరు ప్లీజ్ వాటని తినొద్దని అంటే.. మరికొందరు డిన్నర్‌కు మంచి వంటకాన్ని సిద్ధం చేస్తున్నారన్నమాట అంటూ కామెంట్లు పెట్టారు.
మరికొందరు ఇవేంటో తెలియక తికమక పడి వీటి పేరేంటి అంటూ ఉమేశ్‌ను ప్రశ్నించారు. ఇంకొందరు 'అవి మనుషుల్ని తినేట్టు కనిపిస్తున్నాయి.. వాటిని మీరెలా పట్టుకున్నారు అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రస్తుతం వెస్టిండీస్‌తో ఐదుమ్యాచ్‌ల సిరీస్‌లో తలపడుతున్న భారత్ 2-1 ఆధిక్యంలో ఉంది. జూలై 6న కింగ్‌స్టన్ వేదికగా ఫైనల్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది.