
సాక్షి, జవహర్‌నగర్( హైదరాబాద్): వారం రోజుల్లో పెళ్లి కావాల్సిన ఓ యువతి అదృశ్యమైంది. ఈ ఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ భిక్షపతిరావు తెలిపిన వివరాల ప్రకారం.. దమ్మాయిగూడలోని వెంకటరావునగర్‌కు చెందిన బనావత్ అమృ కుమార్తె శ్వేత(27)కు మే 1న నిర్చితార్థం నిర్వహించారు. ఈ నెల 11న శ్వేతకు వివాహం జరగాల్సి ఉండగా బుధవారం ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆమె ఆచూకి కోసం బంధువుల ఇళ్లతో పాటు సమీప ప్రాంతాల్లో గాలించినా ప్రయోజనం లేకపోవడంతో స్వేత తండ్రి అమృ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment