India vs New Zealand, 1st ODI- Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ భారత మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ వన్డేల్లో సొంతగడ్డపై అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. న్యూజిలాండ్‌తో మ్యాచ్ సందర్భంగా హిట్‌మ్యాన్ ఈ ఫీట్ నమోదు చేశాడు.
కాగా హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో గల రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో టీమిండియా- కివీస్ మధ్య మూడు వన్డేల సిరీస్ బుధవారం ఆరంభమైంది. తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మకు జోడీగా యువ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు.
ఇక భారత ఇన్నింగ్స్ ఆరంభించిన రోహిత్.. మూడో ఓవర్‌లో కివీస్ బౌలర్ హెన్రీ షిప్లే బౌలింగ్‌లో ఎక్స్‌ట్రా కవర్ దిశగా సిక్సర్ బాదాడు. ఈ క్రమంలో ధోని పేరిట ఉన్న రికార్డును హిట్‌మ్యాన్ సవరించాడు. ఆ తర్వాత ఐదో ఓవర్ నాలుగో బంతికి మరోసారి షిప్లే బౌలింగ్‌లోనే రోహిత్ సిక్స్ బాదాడు.
ఇదిలా ఉంటే.. కివీస్‌తో తొలి వన్డేలో మొత్తంగా 38 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ 34 పరుగులు(4 ఫోర్లు, 2 సిక్స్‌లు) చేశాడు. టిక్నర్ బౌలింగ్‌లో డారిల్ మిచెల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
వన్డేల్లో సొంతగడ్డపై అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాటర్లు
►రోహిత్ శర్మ- 125
►ఎంఎస్ ధోని- 123
►యువరాజ్ సింగ్- 71
చదవండి: ఆటో డ్రైవర్ కొడుకు నుంచి టీమిండియా కీలక పేసర్‌గా! ఆ ఒక్క లోటు తప్ప! కెప్టెన్ మాటలు వింటే..
Comments
Please login to add a commentAdd a comment