
తిలక్ వర్మ ఇంట్లో ‘ముంబై ఇండియన్స్’ సందడి (PC: Tilak Varma)
IPL 2023- SRH Vs MI: హైదరాబాదీ బ్యాటర్, ముంబై ఇండియన్స్ స్టార్ తిలక్ వర్మ ఇంట్లో సందడి వాతావరణం నెలకొంది. టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్, భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్ సహా ఎంఐ కుటుంబం మొత్తం తిలక్ ఇంటికి కదిలివచ్చింది.
ఈ అతిరథ మహారథులందరికీ తిలక్ వర్మ ఫ్యామిలీ రుచికరమైన భోజనం వడ్డించి మురిసిపోయింది. ఇందుకు సంబంధిన ఫొటోలను తిలక్ సోషల్ మీడియాలో పంచుకోగా వైరల్‌గా మారాయి. కాగా ఐపీఎల్-2023లో భాగంగా ముంబై ఇండియన్స్ మంగళవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది.
డెవాల్డ్ బ్రెవిస్‌తో తిలక్ కుటుంబం
ఈ రోజును ఎన్నటికీ మరువం
హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ముంబై జట్టు నగరానికి చేరుకుంది. ఈ క్రమంలో తిలక్ వర్మ సహచర ఆటగాళ్లు, కోచింగ్ స్టాఫ్‌ను తన ఇంటికి డిన్నర్‌కు ఆహ్వానించాడు.
తమ జట్టులోని యువ సంచలనం కోరిక మేరకు ముంబై ఇండియన్స్ జట్టు మొత్తం అతడి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఖుషీ చేసింది. సచిన్ , రోహిత్ సహా సూర్య తిలక్ ఫ్యామిలీతో కలిసి ఫొటోలు దిగారు. ఈ నేపథ్యంలో.. ‘‘నా ఎంఐ పల్టన్ ఫ్యామిలీకి మా ఇంట్లో డిన్నర్ పార్టీ. ఈ అద్భుతమైన రోజును నేను, నా కుటుంబం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాం. మా ఇంటికి వచ్చినందుకు ధన్యవాదాలు’’ అంటూ కృతజ్ఞతా భావం చాటుకున్నాడు.
సత్తా చాటుతున్న తెలుగు తేజం
గత సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన రెండో బ్యాటర్(ఇషాన్ కిషన్- 418 తర్వాతి స్థానం)గా తిలక్ వర్మ నిలిచాడు. తన అరంగేట్ర ఎడిషన్‌లోనే 14 ఇన్నింగ్స్‌లో 397 పరుగులు సాధించాడు. ఇక ఐపీఎల్-2023లో ఇప్పటి వరకు ఆడిన 4 మ్యాచ్‌లలో ఈ తెలుగు తేజం 177 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 84 నాటౌట్. ఈ క్రమంలో ప్రస్తుత సీజన్‌లో పరుగుల జాబితాలో ముంబై టాప్ బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు.
చదవండి: Virat Kohli: దూకుడు ఎక్కువైంది.. కోహ్లికి ఊహించని షాకిచ్చిన బీసీసీఐ!
Comments
Please login to add a commentAdd a comment