సాక్షి, హైదరాబాద్: ఉప్పల్‌లో శనివారం లారీ బీభత్సం సృష్టించింది. ఎల్బీనగర్ నుంచి ఉప్పల్ రింగ్ రోడ్డుమీదకు వస్తున్న లారీ.. ఆగి ఉన్న బైక్‌తోపాటు మరికొన్ని వాహనాలకు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న వ్యక్తి ఘటనా స్థలంలోనే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యియి. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ప్రమాదానికి లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
చదవండి: మృత్యువులోనూ వీడని బంధం
Comments
Please login to add a commentAdd a comment