
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఉప్పల్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తండ్రీకొడుకులు దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్యల ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల ప్రకారం.. ఉప్పల్‌లో నర్సింహ శర్మ, శ్రీనివాస్‌ను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. కాగా, శ్రీనివాస్.. మలేషియాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు.
నెల క్రితమే మలేషియా నుంచి స్వదేశానికి వచ్చాడు. హత్యకు సంబంధించిన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ఇద్దరు వ్యక్తులు ముసుగు ధరించి హత్య చేశారు. బంధువులతో ఆస్తి వివాదం కేసు కోర్టులో నడుస్తోంది. ఆస్తి వివాదమే హత్యలకు కారణమని ప్రాథమికంగా నిర్ధారించినట్టు పోలీసులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment