
ఉప్పల్(హైదరాబాద్): ఓ టీచర్ కర్కశత్వం పసి ప్రాణాన్ని బలితీసుకుంది. ఇంకా బలపమే సరిగా పట్టుకోలేని చిన్నారిపై టీచర్ అమానుషంగా ప్రవర్తించాడు. హోంవర్క్ చేయలేదంటూ పలకతో తలపై బలంగా కొట్టాడు. అసలు ఏం జరుగుతుందో తెలియని ఆ చిన్నారి.. టీచర్ కొట్టిన దెబ్బతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తీసుకెళ్లినా ఉపయోగం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు.
వివరాల్లోకి వెళితే..
ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామాంతపూర్ వివేక్ నగర్‌లో స్ట్రీట్ నెంబర్10 లో కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో యూకేజీ విద్యార్థిని టీచర్ తలపై బలంగా కొట్టాడు. శనివారం రోజున స్కూల్ హోమ్ వర్క్ చేయలేదని తలపై పలుకతో కొట్టడం తో స్పృహ తప్పి పడిపోయాడు అభం శుభం తెలియని చిన్నారి. దాంతో ఆ పిల్లాడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినా ఫలితం దక్కలేదు. ఈ రోజు ఉదయం చనిపోయాడు. చనిపోయిన అబ్బాయి మృతదేహాన్ని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ దగ్గర ఉంచి తల్లిదండ్రులు, బంధువులు కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment