ukg student
-
Hyderabad: టీచర్ కర్కశత్వం.. పసి ప్రాణం బలి
ఉప్పల్(హైదరాబాద్): ఓ టీచర్ కర్కశత్వం పసి ప్రాణాన్ని బలితీసుకుంది. ఇంకా బలపమే సరిగా పట్టుకోలేని చిన్నారిపై టీచర్ అమానుషంగా ప్రవర్తించాడు. హోంవర్క్ చేయలేదంటూ పలకతో తలపై బలంగా కొట్టాడు. అసలు ఏం జరుగుతుందో తెలియని ఆ చిన్నారి.. టీచర్ కొట్టిన దెబ్బతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తీసుకెళ్లినా ఉపయోగం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామాంతపూర్ వివేక్ నగర్లో స్ట్రీట్ నెంబర్10 లో కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో యూకేజీ విద్యార్థిని టీచర్ తలపై బలంగా కొట్టాడు. శనివారం రోజున స్కూల్ హోమ్ వర్క్ చేయలేదని తలపై పలుకతో కొట్టడం తో స్పృహ తప్పి పడిపోయాడు అభం శుభం తెలియని చిన్నారి. దాంతో ఆ పిల్లాడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినా ఫలితం దక్కలేదు. ఈ రోజు ఉదయం చనిపోయాడు. చనిపోయిన అబ్బాయి మృతదేహాన్ని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ దగ్గర ఉంచి తల్లిదండ్రులు, బంధువులు కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు. అప్పుడు ప్రాణాలు తీశాడు.. ఇప్పుడు ప్రాణం తీసుకున్నాడు -
పోలీస్‌స్టేషన్‌కు యూకేజీ పిల్లోడు.. ‘మీరంతా వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేయండి’
పలమనేరు: తమ పాఠశాల వద్ద జేసీబీ, ఇతర వాహనాలను అడ్డుగా నిలపడంతో స్కూల్ బస్సులు ఆపాలన్నా, బడికి వెళ్లాలన్నా ట్రాఫిక్ వల్ల ఇబ్బందిగా ఉందని ఓ యూకేజీ పిల్లోడు నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని ఆదర్శ పాఠశాలలో యూకేజీ చదువుతున్న కార్తికేయ (06) నిత్యం బడి వద్ద ట్రాఫిక్ సమస్య తలెత్తడాన్ని గమనించాడు. ఈ సమస్య తీరాలంటే ఎవరితో చెప్పాలని తన తండ్రిని అడగ్గా పోలీసులకు చెప్పాలంటూ సమాధానం ఇచ్చాడు. దీంతో శనివారం ఉదయం కార్తికేయ పోలీస్‌స్టేషన్‌కు వెళ్దాం నాన్నా.. అంటూ మారాం చేయడంతో తండ్రి స్టేషన్ వద్దకు తీసుకెళ్లాడు. వెంటనే లోనికెళ్లిన బుడతడు సీఐ భాస్కర్ వద్దకెళ్లి.. వెంటనే మీరంతా వచ్చి ట్రాఫిక్‌ను క్లియర్ చేయండి అంటూ బుడిబుడిమాటలతో ధైర్యంగా అడిగాడు. ఓ కానిస్టేబుల్‌ను పంపుతామని సీఐ చెప్పడంతో వద్దు సార్.. మీరే రావాలని పట్టుబట్టాడు. ఆ పిల్లాడి ధైర్యానికి సంబరపడిపోయిన సీఐ ఓ మిఠాయి తినిపించి అభినందించాడు. ఏ ప్రాబ్లమ్ వచ్చినా నాకు ఫోన్ చేయమంటూ సీఐ మాటవరసకు చెప్పగా.. ఆ బుడతడు వెంటనే ‘ఫోన్ నంబర్ ఇస్తే కదా’ అనడంతో ఆశ్చర్యపోవడం పోలీసుల వంతైంది. తర్వాత సీఐ ఓ పేపర్‌పై తన సెల్ నెంబరు రాసిచ్చి పంపాడు. అనంతరం ఓ కానిస్టేబుల్‌ను పంపి స్కూల్ వద్ద ట్రాఫిక్ విధుల్లో ఉంచారు. దీన్నంతా సెల్ఫోన్లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఇప్పుడా వీడియో నెట్టింట హల్చల్ సృష్టిస్తోంది. -
యూకెజీ బాలుడిని చితకబాదిన టీచర్ సునీత
-
స్కూల్ బస్సు కింద పడి బాలుని మృతి
చింతలపూడి : చింతలపూడి మండలం, మేడిశెట్టివారిపాలెం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. స్కూల్ బస్సు కింద పడి ఆరు సంవత్సరాల బాలుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మేడిశెట్టివారిపాలెం గ్రామానికి చెందిన చెన్ను పవ¯ŒS(6) సీతానగరం అమృత వర్షం స్కూల్లో యూకేజీ చదువుతున్నాడు. శుక్రవారం స్కూల్ బస్సులో ఇంటికి బయలు దేరాడు. గ్రామంలోని ఇంటికి సమీపంలో బస్సు దిగి రోడ్డు దాటుతుండగా ప్రమాదవశాత్తూ అదే బస్సు టైర్ల క్రింద పడ్డాడు. తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. కళ్లముందే కన్నకొడుకు మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఎస్సై సైదానాయక్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
బస్సు కింద పడి చిన్నారి మృతి
ధర్మారం (నిజామాబాద్): స్కూల్ బస్సు నుంచి దిగిన విద్యార్థి ప్రమాదవశాత్తు అదే బస్సు కింద పడి మృతిచెందాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ధర్మారం-బీ గ్రామంలోని ముదిరాజ్ వీధిలో సోమవారం సాయంత్రం జరిగింది. గ్రామానికి చెందిన బత్తెల మహేష్ (5) సెయింట్ జోసఫ్ స్కూల్లో యూకేజీ చదువుతున్నాడు. రోజూ మాదిరిగానే సోమవారం కూడా స్కూల్ బస్సులో ఇంటి వద్ద దిగాడు. బస్సుకి క్లీనర్ లేకపోవడంతో డ్రైవర్ చూసుకోకుండా నడపడంతో బాలుడు బస్సు వెనుక టైర్ల కిందపడి అక్కడికక్కడి మృతిచెందాడు. బాలుడి మృతితో తల్లిదండ్రులు కొమురెల్లి, శిరీషలు కన్నీరుమున్నీరయ్యారు. -
గుండెలు పిండేసే విషాదం
బెల్లంపల్లి: పాలకుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనాలుగా మారిన ఓ ప్రభుత్వ పాఠశాల పసిపాప ప్రాణాలు బలిగొంది. ఉపాధ్యాయుడి ఉదాసీన వైఖరి చిన్నారి ఊపిరి తీసింది. సర్కారీ నిష్ఫూచీ సర్పమై చిన్నారిని కాటేసింది. తమ చిట్టితల్లి చదువుల రాణిగా చూడాలని ఆశ పడ్డ ఆ తల్లిదండ్రులకు తీరని శోకం మిగిల్చింది. గుండెలను పిండేసే విషాదం జరిగిందిలా.... ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి మండలం బట్వాన్పల్లిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పాముకాటుకు గురై ఎనిమిదేళ్ల చిన్నారి మృత్యువాత పడింది. గామానికి చెందిన గణేష్, అమృత దంపతుల చిన్న కుమార్తె శ్రీహర్ష (8) స్థానిక చాణక్య విద్యానికేతన్ పాఠశాలలో యూకేజీ చదువుతోంది. రోజులాగే తరగతిగదిలో కూర్చొని పాఠాలు వింటోంది. కిటికీ పక్కన పాము పుట్టతో పాటుగా ముళ్లకంచె ఉంది. ఆమె పెన్సిల్ కిటికీ నుంచి బయటకు పడింది. దీంతో శ్రీహర్ష కిటికీ నుంచి బయటకు చేయి పెట్టి తీసుకుంటుండగా పుట్టలో నుంచి పాము బయటకు వచ్చి కాటు వేసింది. వెంటనే ఈ విషయం అక్క శ్రీవిద్యకు చెప్పింది. ఆమె ఉపాధ్యాయుడు అర్జయ్యకు దృష్టికి తీసుకువచ్చారు. ముళ్లతో గాయమైందని వారిని దబాయించిన ఉపాధ్యాయుడు క్లాస్‌రూంలోనే కొంత సమయం వరకు ఉంచారు. మధ్యాహ్న సమయంలో ఇంటికి వెళ్లిన శ్రీహర్షను ఏమైందని తల్లిదండ్రులు అడిగినా ఆమె చెప్పలేక, ముక్కులోంచి నురుగులు కక్కుతూ స్పృహ తప్పి పడిపోయింది. తర్వాత జరిగిన విషయాన్ని చెప్పింది. వారు చిన్నారిని ప్రభుత్వాస్పత్రికి తీసుకు వెళ్లగా, అప్పటికే చనిపోయింది.