స్కూల్‌ బస్సు కింద పడి బాలుని మృతి | boy dead on bus accident | Sakshi
Sakshi News home page

స్కూల్‌ బస్సు కింద పడి బాలుని మృతి

Published Sat, Nov 19 2016 2:34 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

boy dead on bus accident

చింతలపూడి : చింతలపూడి మండలం, మేడిశెట్టివారిపాలెం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. స్కూల్‌ బస్సు కింద పడి ఆరు సంవత్సరాల బాలుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మేడిశెట్టివారిపాలెం గ్రామానికి చెందిన చెన్ను పవ¯ŒS(6) సీతానగరం అమృత వర్షం స్కూల్‌లో యూకేజీ చదువుతున్నాడు. శుక్రవారం స్కూల్‌ బస్సులో ఇంటికి బయలు దేరాడు. గ్రామంలోని ఇంటికి సమీపంలో బస్సు దిగి రోడ్డు దాటుతుండగా ప్రమాదవశాత్తూ అదే బస్సు టైర్ల క్రింద పడ్డాడు. తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. కళ్లముందే కన్నకొడుకు మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఎస్సై సైదానాయక్‌ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement