జూనియర్ ఎన్టీఆర్, సూర్యకుమార్, దేవిషా శెట్టి (PC: Suryakumar Yadav Twitter)
Suryakumar Yadav- Junior NTR: టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను కలిశాడు. తారక్‌తో కలిసి సతీసమేతంగా ఫొటో దిగాడు. ప్రపంచ వేదికపై మరోసారి భారతీయ సినిమా సత్తాను చాటిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమా పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలవడం పట్ల సూర్య హర్షం వ్యక్తం చేశాడు.
బ్రదర్ అంటూ ట్వీట్
ఈ సందర్భంగా తారక్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశాడు. భార్య దేవిషా శెట్టి, ఎన్టీఆర్ నడుమ తాను నిలబడి ఉన్న ఫొటోను పంచుకున్న సూర్య.. ‘‘మిమ్మల్ని కలవడం ఎంతో సంతోషంగా ఉంది సోదరా!
ఆర్‌ఆర్‌ఆర్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలిచినందుకు మీకు మరోసారి శుభాకాంక్షలు’’ అని ట్విటర్‌లో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ హైదరాబాద్‌కు వచ్చాడు.
ఉప్పల్‌లో మ్యాచ్
ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో టీమిండియా- కివీస్ మధ్య తొలి వన్డే జరుగనుంది. ఈ క్రమంలో ఇప్పటికే ఇరు జట్లు హైదరాబాద్‌కు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు టీమిండియా క్రికెటర్లు ఎన్టీఆర్‌ను కలవడం విశేషం.
కాగా టీ20లలో నంబర్ 1గా ఎదిగిన సూర్యకుమార్.. ఇటీవల స్వదేశంలో ముగిసిన శ్రీలంకతో సిరీస్‌లో సత్తా చాటాడు. నిర్ణయాత్మక మూడో టీ20లో సెంచరీతో చెలరేగి జట్టు, సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక మూడో వన్డేలో చోటు దక్కించుకున్నా పెద్దగా ఆకట్టుకోలేకపోయిన సూర్య.. కివీస్‌తో వన్డేల్లో అవకాశం రావడం కష్టంగానే కనిపిస్తోంది.
It was so lovely meeting you, brother!
— Surya Kumar Yadav (@surya_14kumar) January 17, 2023
Congratulations once again on RRR winning the Golden Globe award 🤩 pic.twitter.com/6HkJgzV4ky
ఇక రామ్ చరణ్, జూనియర్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కీరవాణి సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. ఈ పాటను చంద్రబోస్ రచించగా.. ప్రేమ్‌రక్షిత్ నృత్యరీతులు సమకూర్చారు.
చదవండి: IND vs NZ: న్యూజిలాండ్‌తో తొలి వన్డే.. సూర్యకుమార్‌కు నో ఛాన్స్! కిషన్‌కు చోటు
Murali Vijay: సెహ్వాగ్‌లా నాక్కూడా ఆ ఫ్రీడం దొరికి ఉంటే కథ వేరేలా ఉండేది! నా విషయంలో..
Comments
Please login to add a commentAdd a comment