
ప్రతీకాత్మక చిత్రం
జూబ్లీహిల్స్: వెల్‌నెస్ సెంటర్ ముసుగులో వ్యభిచార గృహం నడిపిస్తున్న నిర్వాహకురాలితో పాటు మరో ఇద్దరిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వెంకటగిరిలో నివాసం ఉంటున్న టమటం శైలజ(33) జూబ్లీహిల్స్ రోడ్ నెబర్ 25లో అవని వెల్‌నెస్ సెంటర్ నిర్వహిస్తున్నది. కొంత కాలంగా లొకాంటే వెబ్‌సైట్‌లో ప్రకటనలు ఇస్తూ యువతుల ఫొటోలతో వల వేస్తూ వ్యభిచారం చేయిస్తుంది. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు బుధవారం రాత్రి దాడులు నిర్వహించారు. దాడుల్లో ఇద్దరు విటులు రాజు రెడ్డి, అలీలు పట్టుబడ్డారు. వ్యభిచారం కోసం ఉత్తరాది నుంచి యువతులను తీసుకు వచ్చే శైలజ భర్త పరమేశ్వర్‌రావు పరారయ్యాడు. ఈ మేరకు నిర్వాహకురాలు శైలజపై కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు ఆమెతో పాటు ఇద్దరు విటులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment