
పోలీసుల అదుపులో నిర్వాహకులు, విటుడు
మీర్‌పేట: వ్యభిచార గృహంపై ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేసి నిర్వాహకురాలితో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్న సంఘటన గురువారం మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పోలీస్‌స్టేషన్ పరిధిలోని శ్రీరమణ కాలనీకి చెందిన ప్రణయ నందిని (28) గత కొన్ని రోజులుగా తన ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తోంది. దీనిపై సమాచారం అందడంతో ఎల్‌బీనగర్ ఎస్‌ఓటీ పోలీసులు గురువారం ఇంటిపై దాడి చేసి నిర్వాహకురాలు నందినితో పాటు మరో నిర్వాహకుడు బద్దం నిరంజన్, విటుడు సప్పిడి శ్రీకాంత్‌రెడ్డితో ఓ యువతిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 3,180 నగదు, ఐదు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని మీర్‌పేట పోలీసులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment