సాక్షి, సిటీబ్యూరో: పశ్చిమ బెంగాల్‌కు చెందిన యువతులను సిటీకి తీసుకువచ్చి వ్యభిచారం దందా నిర్వహిస్తున్న వ్యక్తిని పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఇతడితో పాటు ఓ విటుడినీ అరెస్టు చేసి ఓ యువతికి విముక్తి కల్పించినట్లు డీసీపీ రాధాకిషన్‌రావు గురువారం వెల్లడించారు. రాజమండ్రికి చెందిన రవికిరణ్ బతుకుతెరువు కోసం సిటీకి వలసవచ్చి కళ్యాణ్‌నగర్‌లో స్థిరపడ్డాడు. తొలినాళ్లల్లో కొన్ని ఉద్యోగాలు చేసినా అలా వచ్చే జీతంతో జల్సాలు చేయడం సాధ్యం కాలేదు. దీంతో తేలిగ్గా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో వ్యభిచార నిర్వాహకుడిగా మారాడు.
నెలకు రూ.15 వేల అద్దెకు ఓ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్నాడు. పశ్చిమ బెంగాల్ నుంచి యువతులను రప్పిస్తూ వారికి 15 రోజులకు రూ.70 వేల చొప్పున చెల్లించేవాడు. వీరితో పరియస్తులను పిలిపించి వ్యభిచార దందా నిర్వహిస్తున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ బి.గట్టుమల్లు నేతృత్వంలోని బృందం గురువారం దాడి చేసి రవికిరణ్‌తో పాటు విటుడు కృష్ణసాగర్‌ను అరెస్టు చేసింది. వీరి నుంచి రూ.10,500 నగదు తదితరా లు స్వాధీనం చేసుకుని ఓ బెంగాలీ యువతికి విముక్తి కల్పించారు. తదుపరి చర్యల నిమిత్తం కేసును ఎస్సార్‌నగర్ పోలీసులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment