
వివరాలు వెల్లడిస్తున్న సీఐ శ్రీనివాసరావు, వెనుక విటులు, నిర్వాహకురాలు
తెనాలిరూరల్: పట్టణంలోని సాలిపేటలో నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై పోలీసులు బుధవారం తెల్లవారుజామున దాడి చేశారు. వ్యభిచార నిర్వాహకురాలు, ఇద్దరు విటులను అరెస్ట్ చేశారు. వ్యభిచారం చేస్తున్న యువతిని స్వధార్ హోంకు తరలించారు. దీనికి సంబంధించి స్థానిక వన్‌టౌన్ సర్కిల్ కార్యాలయంలో సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ మరీదు శ్రీనివాసరావు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
సాలిపేట అర్బన్ హెల్త్ సెంటర్ సమీపంలో టెలిఫోన్ ఎక్సే ్ఛంజ్ రోడ్డులో ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో వన్‌టౌన్ పోలీసులు దాడులు నిర్వహించారు. వ్యభిచార గృహం నిర్వాహకురాలు చావలి హైమావతి, విటులు కొల్లూరు మండలం చిలుమూరుకు చెందిన తుమ్మపూడి సురేష్, బొండి వెంకట నాగేశ్వరరావు, వ్యభిచారం చేస్తున్న యువతి పట్టుబడ్డారు. యువతిని జేఎంజే స్వధార్ హోంకు తరలించారు. నిర్వాహకురాలు, విటులపై కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపరిచారు.
Comments
Please login to add a commentAdd a comment