Prostitution House; వ్యభిచార ముఠా చేతికి చిక్కి.. బకరా అయిన మాజీ ఉద్యోగి- Sakshi

వ్యభిచార ముఠా చేతికి చిక్కి.. బకరా అయిన మాజీ ఉద్యోగి

Jul 27 2023 8:16 AM | Updated on Jul 27 2023 8:29 PM

- - Sakshi

ఓ మహిళ వచ్చిందని, ఆమెకు రూ.వెయ్యి, నాకు రూ.500 ఇవ్వాల్సి ఉంటుందని అతడితో చెప్పింది. దీంతో అతడు తనకు తెలిసిన రిటైర్డ్‌ ఉద్యోగి ఉన్నాడని,

 ఆదిలాబాద్‌టౌన్‌: వలపు వలలో ఓ రిటైర్డ్‌ ఉద్యోగి చిక్కుకున్నాడు. వ్యభిచార ముఠా వేసిన గాలానికి బ లయ్యాడు. ఆశపడి వచ్చిన రిటైర్డ్‌ ఉద్యోగిని వారు నిండా ముంచేందుకు పన్నాగం పన్నారు. ఆ వృద్ధుడి న్యూడ్‌ ఫొటోలు తీసి బ్లాక్‌మెయిల్‌ చేశారు. డబ్బులు సమర్పించకుంటే పోలీసులను ఆశ్రయిస్తామని, సో షల్‌ మీడియాలో వీడియోను అప్‌లోడ్‌ చేస్తామని బె దిరింపులకు పాల్పడ్డారు. ఆ వృద్ధుడు ఆ వ్యభిచార ముఠాకు కొన్ని డబ్బులు అందజేసి అక్కడినుంచి త ప్పించుకొని పోలీసులను ఆశ్రయించాడు. దీంతో బుధవారం వన్‌టౌన్‌ పోలీసులు ఆ ముఠా గుట్టురట్టు చేశారు. ఈ తతంగం జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.

అసలేం జరిగిందంటే..
ఆదిలాబాద్‌ పట్టణంలోని వాల్మీకినగర్‌ సమీపంలోని ఆర్‌కే కాలనీలో ఓ మహిళ ఇల్లును అద్దెకు తీసుకుని వ్యభిచార దందాను నిర్వహిస్తోంది. ఈమెకు పట్టణానికి చెందిన వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇటీవల సదరు మహిళ అతడికి ఫోన్‌చేసి మహారాష్ట్రకు చెందిన ఓ మహిళ వచ్చిందని, ఆమెకు రూ.వెయ్యి, నాకు రూ.500 ఇవ్వాల్సి ఉంటుందని అతడితో చెప్పింది. దీంతో అతడు తనకు తెలిసిన రిటైర్డ్‌ ఉద్యోగి ఉన్నాడని, ఆ వ్యక్తిని పంపిస్తానని, అతడిని బ్లాక్‌మెయిల్‌ చేసి డబ్బులు వసూలు చేయాలని ప్లాన్‌ చేశాడు. ప్లాన్‌ ప్రకారం రిటైర్డ్‌ ఉద్యోగిని అక్కడికి పంపించాడు.

అక్కడి చేరుకోగానే రిటైర్డ్‌ ఉద్యోగిని గదిలోకి పంపించారు. ఆ గదిలోని మరో మహి ళ న్యూడ్‌ ఫొటోలు తీసింది. కొంత సేపటికి ఆ గదిలోకి నిర్వాహకురాలుతో పాటు మరో మహిళ, మరో ఇద్దరు వ్యక్తులు వెళ్లి బ్లాక్‌మెయిల్‌ చేశారు. తమకు షీటీం వారు తెలుసని భయపెట్టారు. కొంతసేపు తర్వాత బాధితుడిని పంపించిన వ్యక్తి అక్కడికి చేరుకుని ఏమి తెలియన ట్లు జరిగిన విషయాన్ని ఆరా తీశాడు. ముఠా రూ. 2లక్షలు డిమాండ్‌ చేయగా బాధితుడు రూ.40వేలు ఇచ్చేలా ఒప్పందం చేశాడు.

బాధితుడి వద్ద ఉన్న రూ.3వేలు, ఆధార్‌కార్డు, సెల్‌ఫోన్‌ను తీసుకుని మిగి తా డబ్బులు తెచ్చి వీటిని తీసుకెళ్లాలని చెప్పారు. దీంతో బాధితుడు అక్కడి నుంచి బయటకు వచ్చి మంగళవారం సాయంత్రం వన్‌టౌన్‌ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఆరుగురు ముఠా సభ్యులను పట్టుకొని అరెస్టు చేశారు. వీరందరూ ఆదిలా బాద్‌ పట్టణానికే చెందినవారేనని డీఎస్పీ ఉమేందర్‌ తెలిపారు. ఈ సమావేశంలో వన్‌టౌన్‌ సీఐ సత్యనారాయణ ఉన్నారు.

సమాచారం అందించాలి
ఎక్కడైన వ్యభిచారం జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే డయల్‌ 100కు సమాచారం అందించాలి. మీ వివరాలను గోప్యంగా ఉంచుతాం. ఇల్లు అద్దెకు ఇచ్చే ముందు వారి పూర్తి వివరాలు ఇంటి యజమానులు తెలుసుకోవాలి. ఇల్లు అద్దెకు తీసుకొని వ్యభిచారం నడిపిస్తే ఆ ఇంటిని సీజ్‌ చేస్తాం. ఈ ముఠా నుంచి మరి న్ని వివరాలు సేకరిస్తున్నాం. ఆరు నెలలుగా వీరు వ్యభిచారం నడుపుతున్నట్లు తేలింది.
– ఉమేందర్‌, డీఎస్పీ, ఆదిలాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement