వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటిపై నేరేడ్‌మెట్ పోలీసులు దాడి చేసి నిర్వాహకురాలితో పాటు ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.
నేరేడ్‌మెట్ (హైదరాబాద్): వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటిపై నేరేడ్‌మెట్ పోలీసులు దాడి చేసి నిర్వాహకురాలితో పాటు ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రామకృష్ణాపురంలోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న నేరేడ్‌మెట్ పోలీసులు సోమవారం ఆ ఇంటిపై దాడి చేసి నిర్వహకురాలితో పాటు ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి నుంచి ఎనిమిది సెల్‌ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలు, రూ.3,190 నగదును స్వాధీనం చేసుకున్నారు.