
సాక్షి, వరంగల్: మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని శివనగర్‌లో వ్యభిచార గృహంపై దాడి చేసి నిర్వాహకులు, విటులను అరెస్టు చేసినట్లు టాస్క్‌ఫోర్స్ అడిషనల్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ తెలిపారు. వ్యభిచారం చేస్తున్న లేబర్‌కాలనీకి చెందిన తడిగల అరుణ, కాశిబుగ్గకు చెందిన కాకర రజిత, పద్మనగర్ కాలనీకి చెందిన కాసాజోల రేవతి, రెడ్డిపాలెంకు చెందిన రేష్మా, నిర్వాహకుడు శివనగర్‌కు చెందిన దోమల సంపత్, విటులు శివనగర్‌కు చెందిన రంజిత్‌కుమార్, వర్ధన్నపేట ఇల్లందుకు చెందిన బానోతు రాజును అరెస్టు చేసి మిల్స్‌కాలనీ పోలీసులకు అప్పగించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ దాడుల్లో టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్లు ఆర్.సంతోశ్, శ్రీనివాస్ జీ, ఎస్సై వడ్డెబోయిన లవన్‌కుమార్ పాల్గొన్నారు.
చదవండి: ప్రేమ పెళ్లి, ఎవరితో మాట్లాడినా అనుమానం.. ఇంట్లో అందరూ నిద్రపోతుండగా..
Comments
Please login to add a commentAdd a comment