ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్‌ఓటీ), ఎల్బీనగర్ పోలీసులు సంయుక్తంగా ఓ వ్యభిచార గృహంపై దాడి చేసి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఎస్‌ఓటీ ఇన్‌స్పెక్టర్ టి.రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన జి.వెంకటస్వామి అలియాస్ రవి (45), విజయవాడకు చెందిన బి. వరలక్ష్మి (30) కలిసి నాగోల్ జైపురి కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారు.
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న యువతులు, మహిళలకు డబ్బులు ఎరవేసి వారిని వ్యభిచార రొంపిలోకి దింపుతున్నారు. హన్మకొండకు చెందిన విద్యార్థి కృష్ణ ప్రణవ్ (21) వీరిని ఫోన్‌లో సంప్రదించగా.. కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన ఇద్దరు మహిళలను నాగోల్‌లోని ఇంట్లో సిద్ధంగా ఉంచారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు వ్యభిచారం గృహంపై దాడి చేసి.. వరలక్ష్మి, కృష్ణ ప్రణవ్‌లను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై పెటా చట్టం కింద కేసులు నమోదు చేశారు. వీరి నుంచి రూ.1200 నగదు, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు వెంకటస్వామి పరారీలో ఉండగా, ఇద్దరు మహిళలను రెస్క్యూ హోమ్‌కు తరలించారు.
లాడ్జిలో ముగ్గురి అరెస్టు
నాగోలు: ఎల్‌బీ నగర్ ఆర్టీసీ కాలనీలోని బాలాజీ గ్రాండ్ లాడ్జిపై ఎల్‌బీనగర్ పోలీసులు మంగళవారం దాడి చేశారు. లాడ్జిలోని రెండు రూమ్‌ల్లో వ్యభిచారం నిర్వహిస్తున్న కర్ణాటకకు చెందిన శ్రీనివాస్ హనుమంతప్ప అలియస్ శ్రీను (30)ను, నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన జి.నరేష్‌తో పాటు ఓ యువతిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి సెల్‌ఫోన్లు, నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment