raidings
-
గుట్టుగా వ్యభిచారం.. ఇల్లు అద్దెకు తీసుకుని..
సాక్షి, హైదరాబాద్: స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ), ఎల్బీనగర్ పోలీసులు సంయుక్తంగా ఓ వ్యభిచార గృహంపై దాడి చేసి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ టి.రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన జి.వెంకటస్వామి అలియాస్ రవి (45), విజయవాడకు చెందిన బి. వరలక్ష్మి (30) కలిసి నాగోల్ జైపురి కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న యువతులు, మహిళలకు డబ్బులు ఎరవేసి వారిని వ్యభిచార రొంపిలోకి దింపుతున్నారు. హన్మకొండకు చెందిన విద్యార్థి కృష్ణ ప్రణవ్ (21) వీరిని ఫోన్లో సంప్రదించగా.. కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన ఇద్దరు మహిళలను నాగోల్‌లోని ఇంట్లో సిద్ధంగా ఉంచారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు వ్యభిచారం గృహంపై దాడి చేసి.. వరలక్ష్మి, కృష్ణ ప్రణవ్‌లను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై పెటా చట్టం కింద కేసులు నమోదు చేశారు. వీరి నుంచి రూ.1200 నగదు, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు వెంకటస్వామి పరారీలో ఉండగా, ఇద్దరు మహిళలను రెస్క్యూ హోమ్‌కు తరలించారు. లాడ్జిలో ముగ్గురి అరెస్టు నాగోలు: ఎల్బీ నగర్ ఆర్టీసీ కాలనీలోని బాలాజీ గ్రాండ్ లాడ్జిపై ఎల్బీనగర్ పోలీసులు మంగళవారం దాడి చేశారు. లాడ్జిలోని రెండు రూమ్‌ల్లో వ్యభిచారం నిర్వహిస్తున్న కర్ణాటకకు చెందిన శ్రీనివాస్ హనుమంతప్ప అలియస్ శ్రీను (30)ను, నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన జి.నరేష్‌తో పాటు ఓ యువతిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి సెల్ఫోన్లు, నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. -
డ్రైనేజీ పైపులో నోట్ల కట్టలు, నగలు.. అవాక్కయిన ఏసీబీ అధికారులు
సాక్షి, బెంగళూరు: అవినీతి అధికారుల గుట్టు రట్టు చేసేందుకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఓ ఇంట్లోని డ్రైనేజీ పైపులో భారీగా దాచిన నోట్ల కట్టలు, బంగారు నగల్ని చూసి అవాక్కయ్యారు. కర్ణాటకలోని కలబురగి ప్రజాపనుల శాఖ అధికారి శాంతగౌడ బిరాదార్ ఇంటిని ఏసీబీ అధికారులు తనిఖీ చేస్తుండగా.. ఆ ఇంట్లోని డ్రైనేజీ పైపులు అనుమానాస్పదంగా కనిపించాయి. దీంతో ప్లంబర్‌ను పిలిపించి పైపులను తొలగించగా.. అందులో దాచిన కట్టలకొద్దీ నగదు, బంగారం బయటపడ్డాయి. కర్ణాటక వ్యాప్తంగా 60 చోట్ల ఏసీబీ అధికారులు బుధవారం ఏకకాలంలో భారీగా సోదాలు నిర్వహించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. 15 మంది అధికారులు లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. బెంగళూరు సిటీ, రూరల్, మండ్య, కలబురగి, బళ్లారి, మంగళూరు, గదగ్, బెళగావి, గోకాక్, దొడ్డబళ్లాపుర తదితర ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. పలువురి నివాసాల్లో లెక్కలు లేని నగదు, నగలు, ఆస్తి పత్రాలను పెద్దమొత్తంలో గుర్తించారు. నాలుగో తరగతి ఉద్యోగులు వద్ద కూడా కోట్లాది ఆస్తులు బయటపడటం గమనార్హం. -
వడ్డీ వ్యాపారులపై టాస్క్‌ఫోర్స్ దాడులు
కరీంనగర్‌క్రైం: సామాన్యుల అవసరాలు అసరాగా చేసుకుని కరీంనగర్లో వడ్డీ వ్యాపారం చేస్తున్నవారిపై టాస్క్‌ఫోర్స్ బృందాలు రెండు రోజులు దాడులు చేస్తున్నాయి. ‘వడ్డీ దందాకు అడ్డేది’ శీర్షికన ఈనెల 25న ‘సాక్షి’లో వడ్డీ వ్యాపారుల అగడాలతో సామాన్యులు పడుతున్న ఇబ్బందులపై కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన సీపీ కమలాసన్‌రెడ్డి వెంటనే టాస్క్‌ఫోర్స్ బృందాలను రంగంలోకి దించారు. రెండు రోజులుగా పలువురు వడ్డీ వ్యాపారులు, అనుమతి లేని ఫైనాన్స్‌లు, గిరిగిరి ఫైనాన్స్ వ్యాపారులపై దాడులు చేస్తున్నారు. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి పెద్ద ఎత్తున డాక్యుమెంట్లు, సంతకాలు చేసిన ఖాళీ ప్రామిసరీ నోట్లు, బ్లాంక్ చెక్కులు స్వాధీనం చేసుకున్నారు. పలువురి వద్ద భారీగా నగదు డబ్బులు కూడా లభ్యమైనట్లు సమాచారం. మరో రెండు మూడు రోజుల్లోనే వడ్డీ వ్యాపారుల దందాకు సంబంధించి పూర్తిస్థాయిలో విచారణ చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. నిందితులను కూడా అరెస్ట్ చూసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే రామగుండం, సిరిసిల్ల, జగిత్యాల ప్రాంతాల్లో వడ్డీ వ్యాపారులపై దాడులు చేసిన పోలీసులు తాజాగా కరీంనగర్‌లోని వడ్డీ వ్యాపారులపై టాస్క్ఫొర్స్ బృందాలు దాడులు చేయడం సంచలనం కలిగించింది. అయితే ఈ దందాలో పలువురు బాడా బాబుల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. కోటి రూపాయలు పెట్టుబడి పెడితే చాలు నెలకు రూ.20 లక్షలకు పైగా అదాయం వస్తోందని సమాచారం. టాస్క్‌పొర్స్ దాడులతో ఇవన్నీ బట్టబయలు కానున్నాయి. -
ఏసీబీ వలలో ‘వుడా’ అదనపు చీఫ్ అర్బన్ ప్లానర్
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో ఓ అవినీతి తిమింగలం ఏసిబి వలలో చిక్కింది.‘వుడా’లో అదనపు చీఫ్ అర్బన్ ప్లానర్‌గా పనిచేస్తున్నపసుపర్తి ప్రదీప్ కుమార్ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. దస్పల్లా హిల్స్‌లోని ఆయన నివాసం నటరాజ్ టవర్స్‌లో సోదాలు నిర్వహిస్తున్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో 12చోట్ల హైదరాబాద్, అనంతపురం, ఒంగోలు, విశాఖ, విజయవాడల్లోని తండ్రి, కుమారుడు, మామగారు, బంధువుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. సోదాలలో వెలుగు చూస్తున్న అక్రమ ఈ ఆస్తుల విలువ రూ.వందల కోట్లు ఉంటుందని అంచనా. ప్రదీప్ కుమారుడి పేరుతో హెచ్ఎస్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఉన్నట్లు గుర్తించారు. -
గ్రేటర్లో తనిఖీలు ముమ్మరం
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో గ్రేటర్ పరిధిలో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. హైదరాబాద్‌లో గురువారం జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్థన్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ... 997 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేయడంతో పాటు 2700 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. వాహనాల తనిఖీల్లో రూ.32 లక్షల 36 వేలు, స్టాటిక్ సర్వే లైన్స్ సోదాల్లో కోటి రూపాయల వరకు నగదు పట్టుబడిందని ఆయన తెలిపారు. గ్రేటర్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జనార్థన్ రెడ్డి పేర్కొన్నారు.