kalwakurthy mla
-
టీఆర్ఎస్కు సహకారం అందిస్తాం: వంశీచంద్
ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఇచ్చిన హామీలను తెలంగాణ ప్రజలు విశ్వసించారని... అందుకే ఆ పార్టీకి ఓటేశారని కల్వకుర్తి ఎమ్మెల్యేగా ఎన్నికైన వంశీచంద్ రెడ్డి మంగళవారం హైదరాబాద్లో అన్నారు. అదికాక తెలంగాణ ప్రజలు మార్పుకోరుకుని టీఆర్ఎస్ను గెలిపించారన్నారు. అలాగే 10 ఏళ్ల అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత కూడా ఉండి వచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ పార్టీకి తమ వంతు సహకారం అందిస్తామని వంశీచంద్ స్పష్టం చేశారు. అటు దేశంలో ఇటు రాష్ట్రంలో ఓడినందుకు కాంగ్రెస్ పార్టీ బాధపడాల్సిన అవసరం లేదని వంశీచంద్ రెడ్డి పేర్కొన్నారు. -
ఎమ్మెల్యే కారు ఢీ కొని ఆరుగురుకి తీవ్ర గాయాలు
మహబూబ్నగర్ జిల్లా ఉప్పునుంతల మండలం కట్టబండ వద్ద ఆదివారం మధ్యాహ్నం కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ప్రయాణిస్తున్న కారు ఆటోను ఢీ కొట్టింది. ఆ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఎమ్మెల్యే అంగరక్షకులు, అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే క్షతగాత్రులలో ఇద్దరు పరిస్థితి విషంగా ఉందని వైద్యులు వెల్లడించారు. అయితే ఆ ప్రమాదంలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్కు మాత్రం ఎటువంటి గాయాలు కాలేదు.