సాక్షి, జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): పాలమూరును ఎండబెట్టిన ఆంధ్రా పార్టీ టీడీపీ ఇక్కడ అవసరమా అని టీఆర్‌ఎస్ అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. నియోజకవర్గ కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం వివిధ పార్టీల నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరారు. శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ సాధించిన తాము.. అభివృద్ధిని అడ్డుకుంటున్న టీడీపీ చెరోవైపు ఉన్నాయని.. ఎవరికి ఓటేయాలని ప్రజలు ఆలోచించాలన్నారు.
తెలంగాణను అడ్డుకోవడమే కాకుండా పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని కట్టకుండ కేంద్రానికి లేఖలు రాసి పాలమూరు ప్రజల ఉసురుతీస్తున్న టీడీపీ అభ్యర్థికి డిపాజిట్ల గల్లంతు చేయాలని కోరారు. కార్యక్రమంలో రాజేందర్‌గౌడ్, రాజేశ్వర్, వెంకటయ్య, పెద్దవిజయ్‌కుమార్, శివరాజ్ పాల్గొన్నారు. కాగా, తెలంగాణ జన సమితి హన్వాడ మండల అధ్యక్షుడు ఆంజనేయులు తన అనుచరులతో శ్రీనివాస్‌గౌడ్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.
ఎన్‌ఎస్‌యూఐ టౌన్ సెక్రటరీ మహేష్‌యాదవ్ ఆధ్వర్యంలో నరేష్, శ్రీను, శ్రీకాంత్, శాంతి, కాంతు, మహేష్, బండ్లగేరికి చెందిన టీడీపీ నాయకుడు శ్రీనివాస్‌యాదవ్, మున్నూర్ శ్రీహరి టీఆర్‌ఎస్‌లో చేరారు. కార్యక్రమంలో అమరేందర్, నర్సింహయ్య, బాలకిషన్, నర్సిములు, దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు.
నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తాం
మహబూబ్‌నగర్ రూరల్: మరోసారి గెలిపిస్తే పాలమూరు – రంగారెడ్డి పథకం ద్వారా సస్యశ్యామలం చేస్తామని శ్రీనివాస్‌గౌడ్ హామీ ఇచ్చారు. మండలంలోని ఓబ్లాయిపల్లి, కోటకదిర, అల్లీపూర్‌లో మంగళవారం ఆయన ప్రచారం చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రిజర్వాయర్ల నిర్మాణ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయని చెప్పారు. ఓబ్లాయిపల్లిలో కాంగ్రెస్ మాజీ వార్డు మెంబర్ జయమ్మ తన కుమారుడు నర్సిములుయాదవ్‌తో కలిసి టీఆర్‌ఎస్‌లో చేరారు.
కార్యక్రమంలో ఎంపీపీ సావిత్రి, జెడ్పీటీసీ వై.శ్రీదేవి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, మార్కెట్ చైర్మన్ ఆంజనేయులు, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ప్రతాప్‌రెడ్డితో పాటు పి.రవీందర్‌రెడ్డి, రామకిష్టమ్మ, విజయలక్ష్మి, చంద్రకళ, దేవేందర్‌రెడ్డి, లక్ష్మయ్య, వై.శ్రీనివాసులు, వెంకటేష్‌యాదవ్, రాజుగౌడ్, రాజవర్దన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్, కలాల్ పాషా, మూసాబాయి, ఆంజనేయులు, వెంకటస్వామి పాల్గొన్నారు.
శ్రీనివాస్‌గౌడ్‌కే దళిత బహుజనుల ఓట్లు
మహబూబ్‌నగర్ నియోజకవర్గ అభివృద్ధి, పేద ప్రజల సంక్షేమానికి శ్రమిస్తున్న శ్రీనివాస్‌గౌడ్‌కు దళిత, బహుజనులమంతా ఓటేసి గెలిపించుకుందామని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాయికంటి రాందాస్ పిలుపునిచ్చారు. శ్రీనివాస్‌గౌడ్‌కు మద్దతుగా ఎమ్మార్పీఎస్, టీఎమ్మార్పీఎస్, జాతీయ మాలల ఐక్యవేదిక సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలోని 36వ వార్డులో ఇంటింటి ప్రచారం చేశారు.
మాజీ కౌన్సిలర్ బుర్రన్న, నాయకులు రాషాత్‌ఖాన్, ప్రభాకర్, సింగిరెడ్డి పరమేశ్వర్, మునిస్వామి, మల్లెల రాజశేఖర్, కానుగడ్డ యాదయ్య, రాజగాని అశోక్, జి.చెన్నయ్య, కరాటే సత్యం, కట్ట మహేష్, ఎస్.బాలరాజు, కె.తిరుమలయ్య, అనిల్, బి.కృష్ణ, జంబార్, బంగ్లా వెంకటయ్య, పి.వెంకటేష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment