
సాక్షి,హన్వాడ: నియోజకవర్గంలో 60ఏళ్లుగా చేయని అభివృద్ధి నాలుగున్నరేళ్లలో చేసి చూపించామని, మరోసారి ఆశీర్వదిస్తే రెట్టింపు అభివృద్ధి చేస్తానని మహబూబ్‌నగర్ అసెంబ్లీ టీఆర్‌ఎస్ అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శుక్రవారం మండలంలోని తిరుమలగిరి, ఇబ్రహీంబాద్, పుల్పోనిపల్లిలో ఇం టింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్ర తి గ్రామానికి బీటీరోడ్లు, ఇంటింటికి మరుగుదొడ్లు నిర్మించామన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ హ యాంలో మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు, మిషన్‌కాకతీయ పథకంలో చెరువుల పునర్నిర్మాణం చేసినట్లు వివరించారు. అదేవిధంగా కల్యాణలక్షి, షాదీముబారక్, ఆసరా పింఛన్లు ఇచ్చి ఆదుకుందన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే వృద్ధులు, వితంతువులకు రూ.2016, వికలాంగులకు రూ.3016లు ఇవ్వనున్నామన్నారు. ఆయా గ్రామాల్లో శ్రీనివాస్‌గౌడ్‌కు నాయకులు, కార్యకర్తలు,అభిమానులు బ్యాండు మేళాలతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మళ్లీ టీఆర్‌ఎస్ ప్రభుత్వమే వస్తుంది
గండేడ్: టీఆర్‌ఎస్ ప్రవేశపెట్టిన పథకాలే మళ్లీ టీఆర్‌ఎస్‌ను అధికారంలోకి తీసుకొస్తాయని పరిగి అసెంబ్లీ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మహేష్‌రెడ్డి సతీమణి కొప్పుల ప్రతిమారెడ్డి అన్నారు. శుక్రవా రం మండల కేంద్రంలో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. పేదలకోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి వారికి అండగా ఉన్న టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని మళ్లీ అధికారంలో తీసుకురావాలని కోరారు. పరిగి ని యోజకవర్గంలో 30ఏళ్లుగా కొప్పుల హరీశ్వర్‌రెడ్డి ఎంతో అభివృద్ధి చేశారని గుర్తుచేశారు. మహిళలకు ఎంతో చేయూతనిస్తున్న ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చేందుకు మహిళలంతా ఏకతాటిపై నిలిచి విజయకేతనం ఎగురవేయాలని సూ చించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ లక్ష్మివెంకట్, నీరజ, జోగుకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment