
ఛత్తీస్‌గఢ్: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. నారాయణ్‌పూర్ జిల్లాలోని అబూడ్‌మడ్ అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బేస్ క్యాంప్‌పై బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత బాంబులతో దాడి చేశారు. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి.
అర్ధరాత్రి జవాన్లు నిద్రిస్తున్న సమయంలో మావోయిస్టులు ఈరక్ బట్టి క్యాంప్‌పై ఒక్కసారిగా బారెల్ గ్రెనేడ్ లాంచర్లతో విరుచుకుపడ్డారు. నాలుగు బీజీఎల్లను ప్రయోగించారు. దీంతో అప్రమత్తమైన జవాన్లు ఎదురుదాడికి దిగగా మావోయిస్టులు అడవుల్లోకి పారిపోయారు. అదనపు బలగాలతో క్యాంపు పరిసర అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. దాడికి సంబంధించిన వీడియోను పోలీసులు విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment