![TV18 Broadcast revenue was Rs 1,197 crores Fiscal year - Sakshi](/styles/webp/s3/article_images/2019/04/16/Untitled-23.jpg.webp?itok=x6bsHHvK)
న్యూఢిల్లీ: మీడియా కంపెనీ, టీవీ–18 బ్రాడ్‌కాస్ట్ లిమిటెడ్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్లో రూ.30 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.5 కోట్ల నికర లాభం వచ్చిందని టీవీ18 బ్రాడ్‌కాస్ట్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.765 కోట్ల నుంచి రూ.1,197 కోట్లకు పెరిగింది. వయాకామ్ 18 మీడియా, ఇండియాకాస్ట్ మీడియా డిస్ట్రిబ్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్‌లు గత ఏడాది మార్చి 1 నుంచి తమకు పూర్తి అనుబంధ సంస్థలుగా మారాయని కంపెనీ తెలియజేసింది.
అందుకే ఈ క్యూ4 ఫలితాలను, గతేడాది ఫలితాలతో పోల్చడం సరికాదని పేర్కొంది. పూర్తి ఆర్థిక సంవత్సరంలో నిర్వహణ లాభం 30 శాతం వృద్ధితో రూ.314 కోట్లకు పెరిగింది. నికర లాభం రూ.167 కోట్లుగా, నిర్వహణ ఆదాయం రూ.4,993 కోట్లుగా నమోదయింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో టీవీ18 బ్రాడ్‌కాస్ట్ షేరు 5 శాతం నష్టంతో రూ.36.70 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment