Jr NTR and Ram Charan RRR World Television Premiere Date Announced, Deets Inside - Sakshi
Sakshi News home page

RRR Movie Televison Premiere: టీవీలో సందడి చేసేందుకు రెడీ అయిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ఎప్పుడంటే!

Published Wed, Aug 10 2022 8:58 PM | Last Updated on Thu, Aug 11 2022 12:12 PM

Jr NTR and Ram Charan RRR Set for World Television Premiere on August 14 - Sakshi

జూనియర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ మల్టీస్టారర్‌గా జక్కన్న రూపొందించిన భారీ బడ్జెట్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఈ ఏడాది మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్స్‌ రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డు సృష్టించింది. విజువల్‌ ఎఫెక్ట్స్‌, మ్యూజిక్‌, యాక్టింగ్‌.. ఇలా అన్ని కోణాల్లో తిరుగులేదు అనిపించింది ఈ మూవీ. థియేటర్లలో కాసుల వర్షం కురిపించింది.

చదవండి: ‘మై సూపర్‌ ఫ్యాన్స్‌..’ అంటూ మహేశ్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

ఈ సినిమా రిలీజ్‌ అయిన నాలుగు నెలల గడుస్తున్నా ఇప్పటికీ ఓటీటీలో సత్తా చాటుతోంది.  అంతేకాదు ఈ మూవీ మళ్లీ జపాన్‌లో సైతం రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇక ఇప్పుడు ఆర్‌ఆర్‌ఆర్‌ టీవీలో సందడి చేయబోతోంది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్ట్‌ 14న ఈ మూవీ టీవీలో ప్రసారం కానుంది. ఈ రాబోయే ఆదివారం ప్రముఖ తెలుగు చానల్‌ స్టార్‌ మాలోకి ప్రసారం కానుంది. ఇక అదే రోజు రాత్రి 8 గంటలకు హిందీ వర్షన్‌ జీ సినిమాలోకి రానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement